Dharmaveer Shambhaji : భారత దేశాన్ని ముస్లిం దేశంగా మార్చాలనే ఆలోచన ఉన్న మొఘల్ రాజు ఔరంగజేబు అందుకు హిందువులను బలవంతంగా ముస్లిం మతంలోకి మార్చడం, హిందువలను క్రూరంగా హింసించడం వంటి చేస్తూ మరోవైపు హిందూ రాజ్యాలను గెలుస్తూ తన ఆధిపత్యం చూపిస్తున్నా దక్షిణాది వైపు మాత్రం చూడటానికి కూడా భయపడ్డాడు. దీనికి కారణం మరాఠ యోధుడు ఛత్రపతి శివాజీ. శివాజీ రాజ్యపాలన లో ఆయనను ఎదిరించే ధైర్యం ఔరంగజేబు కు లేదు. ముస్లిం దాడులను నుండి హిందువులను కాపాడుతూ హిందూ మత పరిరక్షకుడిగా శివాజీ నిలిచారు. కానీ ఆయన తన రాజ్యంలో పరమత సహనం చూపించారు. ఇతర మతాల వాళ్ళని అందరించారు. అలాగే ముస్లిం మతములోకి బలవంత మార్పిడిని అడ్డుకున్నారు. ముస్లిం నుండి హిందూ మతంలోకి మరినా వ్యక్తితో ఏకంగా తన కూతురిని ఇచ్చి పెళ్లి చేసాడు శివాజీ. ఇక అలాంటి యోధుడు ఉన్నంత వరకు ఏమి చేయలేనని ఔరంగజేబు దక్షిణాది మీద ఆశలు వదిలేసుకున్నాడు. అలాంటి సమయంలో అనారోగ్య కారణాలతో 1680లో శివాజీ మరణించారు. ఇక ఔరంగజేబు నాకు ఎదురు లేదు అనుకున్నాడు. కానీ అతని ఆశలు అడియాసలు చేస్తూ శివాజీ తనయుడు శంభాజీ రాజు అయ్యాడు. ఔరంగజేబు కి చుక్కలు చూపించాడు.

మతం మారమని హింసించినా బెదరని యోధుడు…
శివాజీ మహారాజ్ మరణించాడన్న ఆనందం ఎంతోకాలం ఔరంగజేబు కి మిగల్లేదు. శివాజీ తనయుడు శంభాజీ రాజు అయ్యాడు, తండ్రిలాగానే హిందూ ధర్మ పరిరక్షణ కు కట్టుబడి పాలన చేసిన ఆ మహావీరుడి చరిత్ర చాలా మందికి తెలియదు. చరిత్రలో చాలా తెలివిగా ఆయన గురించి చెప్పక మరుగున పరిచారు. ఛత్రపతి శివాజీ మొదటి భార్య సై బొన్సులే. ఆమె కుమారుడే శంభాజీ రాజ్ బోన్సులే. సై బాయి మరణం అనంతరం శివాజి రెండో భార్య వల్ల శంభాజీ అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు.

కానీ చాలా చురుకైన శంభాజీ పదమూడేళ్ల వయసుకే పదముడు భాషలను అన్ని విద్యలను నేర్చుకున్నాడు. తొమ్మిదేల్ల వయసులో తండ్రితో పాటు ఔరంగజేబు ఆహ్వానం మేరకు విందుకు వెళ్లి బంధీ కాబడినా ఏమాత్రం బెదరకుండా అక్కడినుండి ఇద్దరూ తప్పించుకువచ్చారు. ఇక అతి చిన్న వయసులోనే ఇతర రాజ్యల రాజులతో స్నేహం చేయడం వలన చాలానే విషయాలను నేర్చుకున్నాడు. శివాజీ రాజ్యంలోని ప్రజలు శంభాజీ ని చావా అని ముద్దుగా పిలుచునేవారు. చావా అంటే మరాఠి లో సింహం పిల్ల అని అర్థం. ఇక తండ్రి మరణం తరువాత సింహాసనం అందుకున్న శంభాజీ తన పినతల్లి కుట్రలను తిప్పికొట్టి ప్రజల కోరిక మేరకు రాజయ్యడు.

ఇక ఔరంగజేబు రెండు లక్షలసైన్యాన్ని కేవలం ఇరవై వేల మందిసైన్యం తోనే తిప్పికొట్టాడు. మూడుసార్లు విఫలం ప్రయత్నం చేసిన ఔరాంగజేబు ఇక నేరుగా ఎదురకోలేనని అర్థమై కుట్ర చేసి శంభాజీ మనుషుల ద్వారానే శంభాజీ ఒంటరిగా ఉన్న సమయంలో బందించాడు. మతం మార్చుకుంటే ప్రాణ భిక్ష పెడతానని చెప్పినా శంభాజీ ప్రాణం పోయినా మతం మారనని ధైర్యంగా నిలబడ్డాడు. ఇక ఔరంగజేబు ఒంటెలకు చేతులను కట్టి నడివీధుల్లో శంభాజీని ఊరేగించగా మొఘల్ ప్రజలు శంభాజీ మీద రాళ్లు, పేడ విసిరి ఆరోజు సంబరాలు చేసుకున్నారు. ఇక శంభాజీ కి ఔరంగజేబు మూడు షరతులను విధించాడు. మతం మారడం, రాజ్యం ఇచ్చేయడం, ఔరంగజేబు అత్యంత శక్తి వంతమైన రాజుగా అంగీకరించడం వీటికి ఒప్పుకోకపోవడంతో శంభాజీ ని నలభై రోజుల పాటు చిత్ర హింసలకు గురిచేసారు. కాళ్ళు చేతులు కట్టేసి నాలుక కత్తిరించి రోజుకో అవయవం తొలగిస్తూ, వేళ్లను ఒక్కొక్కటిగా కత్తిరించినా, బ్రతుండగానే చర్మం వలిచినా, గోర్లను తొలగిస్తూ వాటిపై ఉప్పు చల్లి హింసించి మతం మారమని రోజు అడిగినా శంభాజీ సమాధానం ఒక్కటే అవడంతో చివరికి నలభై రోజులు గడిచాక ఔరంగజేబు విసిగి తల నరికించాడు. అప్పుడు కూడా శంభాజీ తన ఇష్ట దైవం అయిన శివుడిని ప్రార్థించాడు. ఇక ఆయన శవాన్ని ముక్కలుగా కోసి నదిలో పడేయగా అక్కడి దగ్గరిలోని గ్రామస్థులు వాటిని సేకరించి ఘనంగా అంతిమ సంస్కారాలు చేసారు. అలా శంభాజీ ధర్మవీర్ శంభాజీ గా చరిత్ర చెప్పని వీరుడిగా మిగిలాడు.



























