Saaho: టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటుడు ప్రభాస్ ఒకరు. ఈయన అప్పటివరకు తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు కానీ ఎప్పుడైతే బాహుబలి సినిమా చేశారో. అప్పటి నుంచి పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నారు. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ నటించిన సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

బాహుబలి తరువాత ప్రభాస్ నటించిన పాన్ ఇండియా చిత్రం సాహో. సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ఈ సినిమా మొదట ప్రేక్షకులకు పెద్దగా ఎక్కలేదు కానీ రెండోసారి ఈ సినిమా చూస్తే మాత్రం సుజిత్ స్క్రీన్ ప్లేకు ప్రతి ఒక్కరు కూడా పిచ్చెక్కిపోతారు అంత అద్భుతంగా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.
ఇలా ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ అనుకున్న స్థాయిలో కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. ముఖ్యంగా సౌత్ ప్రేక్షకులకు ఈ సినిమా ఏ మాత్రం ఎక్కలేదని చెప్పాలి. ఇక సాహో సినిమాలో ప్రభాస్ ఫ్రెండ్ పాత్రలో నటుడు అరుణ్ విజయ్ పాత్ర కూడా మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. మరీ ముఖ్యంగా కారులో ప్రభాస్ గురించి ఇచ్చే ఎలివేషన్స్ వేరే లెవెల్ అని చెప్పాలి.
ఇలా ప్రభాస్ ఫ్రెండ్ పాత్రలో నటించిన అరుణ్ విజయ్ ఇద్దరు చెల్లెలు టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్స్ అనే విషయం చాలామందికి తెలియదు. మరి ఈయన సిస్టర్స్ ఎవరు అనే విషయానికి వస్తే… అరుణ్ విజయ్ తమిళంలో స్టార్ హీరో ఈయన స్వయాన సీనియర్ నటుడు విజయ్ కుమార్ కొడుకు అనే సంగతి తెలిసిందే. ఇక నటుడు విజయ్ కుమార్ సైతం ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.
మంజుల విజయ్ కుమార్ సంతానమైనటువంటి ప్రీతా విజయ్ కుమార్, శ్రీదేవి విజయ్ కుమార్. 1997లో వచ్చిన రుక్మిణి సినిమాలో హీరోయిన్గా నటించిన ప్రీతా విజయ్ కుమార్ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి పలు తెలుగు సినిమాలలో నటించారు. శ్రీదేవి విజయ్ కుమార్ కూడా తెలుగులో క్రేజీ హీరోయిన్. ప్రభాస్ డెబ్యూ సినిమా ఈశ్వర్లో హీరోయిన్గా నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చి అనంతరం పలు సినిమాలలో నటించారు ఇలా వీరిద్దరూ కూడా నటుడు అరుణ్ విజయ్ చెల్లెలు అని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.



























