అఖండ సినిమా విలన్ ఒక ఆర్మీ ఆఫీసర్ అని మీకు తెలుసా?

0
1592

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య విడుదలైన సినిమా “అఖండ”. ఈ సినిమా విడుదలకు ముందే ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగింది. సినిమా విడుదల అయిన తర్వాత కూడా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఒకవైపు బాలకృష్ణ నటన మరోవైపు బోయపాటి టేకింగ్.. మరో వైపు తమన్ సంగీతానికి ప్రతీ ఒక్కరూ ఫిదా అయిపోయారు. అన్ని ఏరియాల నుంచి ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది.

మొదటి సారిగా శ్రీకాంతో మెయిన్ విలన్ పాత్రలో శ్రీకాంత్ నటించాడు. నెగెటివ్ షేడ్ ఉన్న రోల్ శ్రీకాంత్ అంతకముందు చేసినా.. ఇంత భారీ సినిమాల్లో ఇంతవరకు చేయాలేదు. అతడి నటన కూడా అదరినీ బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో బాలయ్యను ఢీ కొట్టే విలన్ పాత్రలో శ్రీకాంత్ తో పాటు మరో నటుడు నితిన్ మెహతా కూడా కనిపించారు. అతడు సైన్యంలో 21 ఏళ్ల పాటు సేవలను అందించాడు.

అతడికి ప్రొఫెషనల్ మోడల్ గా, నటుడిగా మారాలని ఎన్నో కలలు కన్నారట. దాని కోసం ఎంతో ప్రయత్నించి.. తనకుఎంతో ఇష్టమైన ఆర్మీ యూనిఫామ్ ను సైతం వదులుకున్నారట. బాలీవుడ్ లో ‘కాబిల్’, ‘భూమి’ వంటి సినిమాల్లో నటించారాయన. సౌత్ లో కూడా రెండు, మూడు సినిమాల్లో నటించారు. కానీ ఏదీ సరైన గుర్తింపును తీసుకురాలేకపోయింది. ‘అఖండ’ మాత్రం అతడికి మంచి బ్రేక్ ఇచ్చిందనే చెప్పాలి.

ఈ సినిమాతో హాట్ టాపిక్ గా మారారు నితిన్ మెహతా. ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ విడుదలైన సమయంలో నితిన్ అందరి దృష్టి ఆకర్షించాడు. అచ్చం త్రివిక్రమ్ శ్రీనివాస్ లాగా ఉన్నారంటూ సోషల్ మీడియాలలో మీమ్స్ కూడా వచ్చాయి. నితిన్ మెహతా నటనకు ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారు. అతడు తనకు ఇచ్చిన పాత్రకు న్యాయం చేశాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నితిన్ ఇతర భాషల్లో అతడికి అవకాశాలు వస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.