Dil Raju : డిస్ట్రిబ్యూషన్ నుండి బడా నిర్మాతగా ఎదిగిన దిల్ రాజు సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా పేరు ఉంది. కుటుంబ కథా చిత్రాలతో హిట్లందుకున్న దిల్ రాజు జడ్జిమెంట్ పక్కాగా ఉంటుంది. అందుకే ఆయన లిస్ట్ లో ఉన్న సినిమాలు హిట్ అయ్యాయి. ఇక దిల్ రాజు భార్య అనిత గారు మరణించాక ఆయన కూతురు హర్షిత రెడ్డి, బంధువుల సలహా మేరకు రెండో పెళ్లి చేసుకున్నారు దిల్ రాజు.

మగబిడ్డకు జన్మనిచ్చిన తేజస్వి…
ఇక దిల్ రాజు గారికి తాజాగా మగబిడ్డ పుట్టాడు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. అయితే తేజస్విని రెడ్డి పండంటి మగబిడ్డకు బుధవారం తెల్లవారుజామున జన్మనిచ్చింది. దీంతో దిల్ రాజు కుటుంబం ఆనందంలో మునిగి తేలుతున్నారు .

Dil Raju annaaaaaaaaaa congratulations ????????????was blessed with a baby boy ???? @SVCCofficial
— BANDLA GANESH. (@ganeshbandla) June 29, 2022
ఇక ఈ విషయాన్ని బండ్ల గణేష్ తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసారు. దిల్ రాజు అన్నా నీకు శుభాకాంక్షలు. ఆయనకి మగబిడ్డ జన్మించాడు అంటూ ట్వీట్ చేశాడు. ఇక దిల్ రాజు ప్రస్తుతం తమిళ హీరో విజయ్ తో వంశీ పైడిపల్లి డైరక్షన్ లో సినిమా నిర్మిస్తున్నాడు. ఇక రామ్ చరణ్, శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా నిర్మిస్తున్నారు.



























