Dil Raju : ప్రస్తుతం టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్లలో ఒకరుగా దిల్ రాజు చలామణి అవుతున్నారు. మొదట డిస్ట్రిబ్యూటర్ గా తన కెరీర్ ను ప్రారంభించిన దిల్ రాజు, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అనే బ్యానర్ ను స్థాపించి మొదటగా నితిన్ హీరోగా దిల్ సినిమాని నిర్మించారు. తరువాత మొదటి సినిమా తన పేరుగా మారిపోయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కెరీర్ లో వెనుదిరిగి చూసుకోకుండా ముందుకు వెళ్తున్నారు. ప్రస్తుతం దిల్ రాజు రామ్ చరణ్, శంకర్ దర్శకత్వంలో వస్తున్న RC15 సినిమాను నిర్మిస్తున్నారు.

యంగ్ హీరోయిన్ ను పెళ్లి చేసుకోవాల్సింది పోయి…
ప్రస్తుతం చాలా మటుకు సినిమా ఇండస్ట్రీ దిల్ రాజు చేతిలో ఉంది అనడం అతిషయొక్తి కాదు అని కొంతమంది టాలీవుడ్ పెద్దలు అంటున్నారు. ఒక సినిమా థియేటర్ రిలీజ్ ఎప్పుడు చేయాలి, ఓటీటీ రిలీజ్ ఎప్పుడు చేయాలి వంటివి దిల్ రాజు చేతిలో ఉన్నట్టు కూడా మాటలు వినిపిస్తున్నాయి. అయితే మరొకవైపు దిల్ రాజు మీద నెగిటివ్ ప్రచారం కూడా జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం ఆయన రెండవ వివాహం గురించి ఇలాంటి వార్తలు వైరల్ అవుతున్నాయి.

దిల్ రాజు మొదటి భార్య చనిపోవడంతో రెండో పెళ్ళి చేసుకున్నాడు దిల్ రాజు. అయితే రెండవ వివాహంని మొదట స్టార్ హీరోలతో సెకండ్ హీరోయిన్ గా నటించి తక్కువ కాలంలోనే ఫేడ్ అవుట్ అయిపోయిన హీరోయిన్ ని చేసుకోవాలి అనుకున్నాడట. దిల్ రాజుతో ఫ్రెండ్షిప్ కూడా చేసిన ఈ బ్యూటీ జీవితంలో పెళ్లి చేసుకోను అని తెగేసి చెప్పిందట. తరువాత కూతురు సెలెక్ట్ చేసిన తేజస్విని ని పెళ్లి చేసికున్నాడట. ఇక దిల్ రాజు, తేజస్విని జంటకు ఇటీవలే ఒక బాబు కూడా పుట్టాడు.
































