Dil Ramesh : క్యారెక్టర్ ఆర్టిస్ట్, సైడ్ విలన్ గా చాలా చిత్రాల్లో నటించిన రమేష్. దిల్ సినిమాలో తన నటనకు సినిమా పేరునే తన ఐడెంటిటీ గా మార్చుకుని దిల్ రమేష్ గా మారాడు రమేష్. సినిమా అవకాశాల గురించి, శ్రీహరి గారితో ఆయన అనుబంధం, ఉదయ్ కిరణ్ తో జ్ఞాపకాలను ఇంటర్వ్యూ లలో వివరించారు.

శ్రీహరి గారు అలా చెప్పేవారు…..
కష్టపడి పైకి వచ్చాడు కాబట్టి శ్రీహరి గారికి కష్టపడే వాళ్లని ఆదరించడం తెలుసనీ, ఎప్పుడు నాకు ధైర్యం చెప్పేవారని, ఏదో ఒకరోజు నువ్వు పెద్ద ఆర్టిస్ట్ అవుతావు అంత వరకు ఓపికగా ఎదురుచూడమని కష్టపడమని చెప్పారంటూ శ్రీహరి గారిని గుర్తు చేసుకున్నాడు. ఇక ఉదయ్ కిరణ్ గురించి మాట్లాడుతూ నువ్వునేను సినిమా అప్పటి నుండి ఉదయ్ కిరణ్ తెలుసనీ చాలా సింపుల్ గా ఉండే వ్యక్తి అని చిన్న వయసులోనే సూపర్ హిట్లు అందుకుని అప్పటికే కోటిరుపాయల రెమ్యూనరేషన్ తీసుకునే వాడని తెలిపారు.

ఆయన చావుకి కారణం ఏమిటనే ప్రశ్న వచ్చినపుడు ఇప్పటి తరం వాళ్లు జీవితంలో సంతృప్తి లేకుండా బ్రతుకుతున్నారని సాధించిన విజయాన్ని గుర్తించకుండా ఇంకేదో సాదించాలనే తాపత్రయంతో పరుగులు పెడుతున్నారని దీనివల్ల మానసిక ఒత్తిడికి లోనవుతున్నారని చెప్పారు. సినిమా ఇండస్ట్రీ లో ఇటువంటివి మరింత ఎక్కువగా ఉన్నాయని మన పక్కనున్న వాళ్ళు అవకాశాలతో ముందుకు వెళుతున్నారని మదనపడుతూ మానసిక ఒత్తిడికి లోనవుతున్నారని చెప్పారు. ఉదయ్ కిరణ్ కూడా ఒంటరితనం, మానసిక ఒత్తిడి వళ్లే మరణించి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. జీవితంలో ఎప్పుడు విజయాలు సాధిస్తూనే ఉండమని ఎప్పుడైనా ఫెయిల్యూర్స్ ఎదురైనా ఎవరు మనలను పట్టించుకోక పోయినా ఎలా ఉండాలో ముందే సిద్ధపడితే ఇలాంటి ఒత్తిడికి లోనవ్వమని దిల్ రమేష్ చెప్పారు.
































