టాలీవుడ్ ఇండ్రస్ట్రీ ముఖ్యంగా ముగ్గురు నిర్మాతల చేతుల్లో ఉందన్న విషయం తెలిసిందే.. తెలుగు ఇండస్ట్రీలో తెరకెక్కుతున్న సినిమాలు అన్నీవీరి చేతుల్లోనే ప్రసారం అవుతున్నాయి.. అయితే వాళ్ళ కుటుంబం గురించి తెలుసుకోవాలని చాలా మంది అనుకుంటారు.. అల్లు అరవింద్, దగ్గుపాటి సురేష్, దిల్ రాజు.. అయితే దిల్ రాజు కేవలం సినిమాలకు నిర్మాతగానే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న చాలా థియేటర్లకు డిస్ట్రిబ్యూటర్ గా కూడా వ్యవహరిస్తున్నారు.. దర్శకుల్లో రాజమౌళి, నిర్మతల్లో బడా పేరుకు బాప్ దిల్ రాజు..

ఇకపోతే దిల్ కుటుంబ సభ్యులకు సంబందినవి తెలుసుకోవాలని చాలా మంది ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.. కేవలం సినిమాల్లోనే కాదు ఇంట్లో కూడా దిల్ రాజు మంచి అభ్యుదయ భావాలున్న వ్యక్తి.. అందుకే చాలా మంది దిల్ రాజు లా ఉండాలంటూ అనుకుంటారు.. ఇది ఇలా ఉండగా ఇతనికి ఒక్క కూతురు మాత్రమే ఉంది. ఆమెకు అచ్యుత్ రెడ్డి అనే వ్యక్తితో వివాహమైంది. దిల్ రాజు కుమార్తె హన్షిత శ్రీ వేంకటేశ్వర ప్రొడక్షన్ బాధ్యతలను చూసుకుంటుంది..అగ్ర నిర్మాతలలో ఒకరైన ‘దిల్’ రాజు కుమార్తె సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు.

తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోయర్లు సర్‌ప్రైజ్ అయ్యేలా ఆమె కొన్నిఫొటోలను పోస్ట్ చేశారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలోని నెటిజన్లందరికీ సడన్ సర్‌ప్రైజ్ ఇచ్చాయి. స్విమ్మింగ్ ఫూల్‌లో ఉండగా, తన భర్త తనకు ముద్దు పెడుతున్న ఫొటోను హన్షిత రెడ్డి పోస్ట్ చేశారు. ‘నైస్ పిక్’ అని నెటిజన్లు కామెంట్ లను కూడా షేర్ చేస్తున్నారు. హన్షిత రెడ్డి ఎక్కువగా పిల్లల ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తుంటారు. పండగలు, పుట్టినరోజులు వస్తే స్పెషల్ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయో కూడా తెలియజేస్తుంటారు. కానీ., ఎవరూ ఊహించని విధంగా స్విమ్మింగ్ ఫూల్ ఫొటోలను పోస్ట్ చేయడం ఇదే మొదటిసారి. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి.. వీలైతే మీరూ ఓ లుక్కెయ్యండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here