ఎయిర్ హోస్ట్రెస్‌ ని పెళ్లి చేసుకున్న దిల్ రాజు… అమ్మాయి ఎలా ఉందో చుడండి.

0
669

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు రెండో పెళ్లి చేసుకోనున్నట్టు గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. మూడేళ్ళక్రితం అయన మొదటి భార్య అనిత అనారోగ్యంతో మరణించారు. అప్పటినుంచి ఒంటరిగా ఉంటున్న దిల్ రాజు మరో సారి పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్త టాలీవుడ్ లో చక్కర్లు కొట్టింది. అయితే వాటిని నిజం చేస్తూ నిన్న రాత్రి నిజామాబాద్ వేంకటేశ్వరస్వామి సన్నిధిలో కొద్దిమంది బంధువుల సమక్షంలో ఆదివారం రాత్రి రెండో పెళ్లి చేసుకున్నారు.

దిల్ రాజు భార్య మూడేళ్ళ క్రితం మరణించిన తరువాత అయన తీవ్ర బాధకు లోనయ్యారు. అప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్నారు దిల్ రాజు. ఈ వయసులో తన తండ్రి ఒంటరిగా ఉంటూ పడుతున్న కష్టాలను చూసి అయన కూతురు హర్షిత రెడ్డి ఎలాగైనా తన తండ్రికి పెళ్లి చేయాలనీ డిసైడ్ అయింది. ఈ నేపథ్యంలో ఆమె పెళ్లి పెద్దగా వ్యవహరిస్తూ మాతృ దినోత్సవం రోజున తన తండ్రికి మళ్ళీ పెళ్లి చేసింది. ఈ క్రమంలో అయన పెళ్లి చేసుకున్న యువతి ఎవరు అని అటు టాలీవుడ్ తో పాటు, తెలుగు ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి మొదలైంది.

అయితే ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయం అయిన తేజ అనే యువతిని దిల్ రాజు పెళ్లి చేసుకున్నట్టు తెలుస్తుంది. గతంలో ఆమె ఎయిర్ హోస్ట్రెస్ గా పనిచేసింది. వీరి పెళ్లి ఫోటోలు మీకోసం.