మీటూ ఉద్యమం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ముఖ్యంగా సినీ రంగాన్ని కుదిపేస్తోంది. 2018లో ఈ ఉద్యమం బాలీవుడ్‌ను తాకింది. హీరోయిన్ తను శ్రీ దత్తా సీనియర్ నటుడు నానా పటేకర్ తనను లైంగికంగా వేధించాడంటూ సంచలన కామెంట్స్ చేయటంతో ఒక్కసారిగా బాలీవుడ్ అంతా షాకయ్యింది. ఈ సంఘటన జరిగిన తర్వాత మరికొన్ని మీటూ స్టోరీస్ కు సంబంధించిన లైంగిక వేధింపుల కథలు తెర మీదకు వచ్చాయి. లేటెస్ట్ గా ఈ లిస్ట్‌లోకి ప్రముఖ బాలీవుడ్ సినీ దర్శకుడు సాజిద్ ఖాన్ పేరు కూడా వెలుగులోకి వచ్చింది.

సినిమా ఛాన్స్ కోసం వెళితే డైరెక్టర్ సాజిద్ ఖాన్ తనతో చాలా దారుణంగా ప్రవర్తించాడంటూ మోడల్ డింపుల్ పౌలా సంచలన కామెంట్స్ చేసింది. వివరాల్లోకి వెళ్తే.. తనకప్పుడు 17ఏళ్లని, “హౌస్ ఫుల్” చిత్రం లోని ఓ పాత్రకోసం సాజిద్ ఖాన్ దగ్గరకు వెళ్లానని, గదిలోకి పిలిచిన సాజిద్.. తన ముందు బట్టలు విప్పి నగ్నంగా నిలబడమని లైంగికంగా వేధించాడని, నాకంటే ముందు అలా ఎంతమంది అమ్మాయిలను సాజిద్ ఖాన్ వేధించాడో దేవుడికే తెలుసని, అప్పుడు నాకు ధైర్యం సరిపోలేదు. ఆ టైములో నా కుటుంబం గురించి కూడా ఆలోచించి ఇన్నాళ్లు మౌనంగా ఉన్నానని, ఇప్పుడు నా బ్రతుకు నేను బతుకుతున్నా. అందుకే ఇప్పుడు ధైర్యంగా బయటికొచ్చిచెబుతున్నాను.

ఇలాంటి కామాంధులు ఉండాల్సింది సమాజంలో కాదు కటకటాల వెనుక అని, అతడి నిజ స్వరూపాన్ని ఇన్నాళ్లూ బయట పెట్టకపోవడం నేను చేసిన తప్పుని’ ఈ సందర్భంగా మోడల్ డింపుల్ పౌలా తన ఆక్రోశాన్ని తెలియజేసింది. ఇందుకు సాక్ష్యంగా డింపుల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఇలాఉండగా, మీటూ ఉద్యమం ప్రారంభమైనపుడు ‘హౌస్‌ఫుల్ 4″ షూటింగ్ టైంలో ఆ చిత్ర సహాయ దర్శకురాలు సాజిద్ పై ఇలాంటి కామెంట్స్ చేయటంతో ఆయన ఆ సినిమా దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.

సాజిద్ లాంటి సూపర్ హిట్ దర్శకుడిపై ఇలాంటి సంచలనమైన కామెంట్స్ రావటంతో అతడి ఫాన్స్ కూడా షాక్ అయ్యారు. సాజిద్ ఖాన్‌పై బాలీవుడ్ లో ఆ తర్వాత కూడా చాలా మంది హీరోయిన్స్ తాము కూడా సాజిద్ నుండి లైంగిక వేధింపులకు గురయ్యామని ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దాంతో ఇండియన్ ఫిలిం & టెలివిజన్ డైరెక్టర్స్ అసోషియేషన్ సాజిద్ ఖాన్ ను ఏడాది పాటు అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేసింది.



























