Viral Video: అంతరించిపోయిన జంతువుల జాతికి చెందిన రాక్షసబల్లి గురించి అందరికీ తెలుసు. వీటిని డైనోసార్ల అని కూడా పిలుస్తారు. ఇవి సుమారు 160 మిలియన్ సంవత్సరాలకు ముందు భూమి మీద సంచరించిన ఒక రకమైన జంతువు. పూర్తిగా ఇవి ఎప్పుడు అడుగంటి పోయిన సంగతి తెలుసు.

ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ జంతువును చూసి అది నిజమైన డైనోసార్ లాగ ఉండడంతో అదసలు ఏంటని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. ఇక దాని గురించి లోతైన సమాచారం తెలుసుకుందాం. ఇన్ స్టా లో ‘ క్యూటి పేట్స్ వైల్డ్ ‘ అనే ఖాతాలో జనవరి 5న ఈ వీడియో ను పంచుకున్నారు. ఈ వీడియో లో ఒక చిన్న డైనోసార్ ని ఓ డాక్టర్ ఎత్తుకున్నట్లు కనిపిస్తుంది.

ఆ డైనోసార్ కూడా తోక ఊపుతుంది. దాంతో అది నిజమైన డైనోసార్ అని లేనిపోని డౌట్ ముంచుకొస్తుంది నెటిజన్లకు. చైనాలో ఈ డైనోసార్ ని సృష్టించారని. దీనిని క్లోనింగ్ పద్ధతిలో పుట్టించారని తెలుపుతున్నారు. మరికొందరు డైనోసార్ వల్ల కొత్త వేరియంట్లు వస్తాయని అంటున్నారు.
కానీ ఇది నిజానికి అప్పటి వీడియో కాదు. ఇక గతంలో అలాంటిదే మరో వీడియోని ట్విట్టర్ వేదికగా@మార్టఫాక్ అనే ఖాతాలో పంచుకున్నారు. అందులో ఈ పిల్ల డైనోసార్ అరిచినట్టు ఈ వీడియోలో కనబడుతుంది. నిజానికి ఏమిటంటే అది నిజమైన రాక్షసబల్లి కాదు. జురాసిక్ వరల్డ్ కు చెందిన ఎగ్జిబిషన్లో పారాసారోలోఫస్ జాతికి చెందినటువంటి ఈ బుల్లి డైనోసార్ బొమ్మ ని సృష్టించారు.
ఇవి కీలు బొమ్మలు మాత్రమే..
ఇవి బొమ్మ లైనప్పటికీ.. చూడ్డానికి నిజమైన ఇలాగే కనిపిస్తాయి. థీమ్ పార్కులో అలాంటి వాటిని ఏర్పాటు చేశారు. ఇవి కీలుబొమ్మలు లాంటివి. కొన్ని సినిమాల షూటింగ్ లో కూడా ఇలాంటి వాటిని వాడుతారు. ఈ జాతి డైనోసార్లు ఎప్పుడో అంతరించి పోయాయి. వాటిని గుర్తు చేసుకుంటూ.. దీన్ని అలా తయారు చేశారు. చూడడానికి మాత్రం ఇది నిజమైన డైనోసార్ లాగే కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో ఇన్ స్టా లో నెటిజన్ల ను ఆకట్టుకుంటుంది. 15.2k లైక్స్ తో తెగ హడావుడి చేస్తుంది. ఇది చూసిన ఓ నెటిజన్ ‘ పికాచు’ అని కామెంట్ చేయగా మరో నెటిజన్ ‘ఇట్స్ ఫేక్ ‘ అని కామెంట్ తో తెల్చేస్తున్నాడు. ఏదైనా వీడియో తెగ వైరల్ గా మారింది.



























