టాలీవుడ్ ప్రముఖ దర్శకులు స్వర్గీయ కోడి రామకృష్ణ ఈ పేరు తెలియని తెలుగు వారు ఉండరు. అయన దర్శకత్వంలో పని చేయాలనీ ఎదురు చుసిన వారెందరో… టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక శైలి ఏర్పరుచుకున్న దర్శకుడు కోడి రామకృష్ణ. తెలుగు పరిశ్రమలో ఎన్నో విజయాలు అందుకున్న దర్శకుడు కోడి రామకృష్ణ. తెలుగునాట అయన చేయని ప్రయోగాలు లేవనే చెప్పుకోవాలి. ప్రయోగాలు చేయడంలో ఆయనకి ఆయనేసాటి. ఆ ప్రయోగాలను విజయాలుగా మలచడం కూడా అయనకె చెందింది. ఎంతోమంది నటీ నటులను టాలీవుడ్ చిత్ర పరిశ్రమకి అందించిన ఘనత ఆయనది. అప్పట్లోనే తెలుగు సినెమాలకు గ్రాఫిక్స్ మాయాజాలాన్ని అందించిన ఘనత కూడా ఆయనకే చేందుకుతుంది. అంతేకాదు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ వంటి టాలీవుడ్ టాప్ నటీ నటులకు అయన అందించిన విజయాలు అన్ని ఇన్ని కావు.

“ఆలయ శిఖరం” , “గూఢచారి నం. 1” వంటి అద్భుతమైన బ్లాక్ బస్టర్ చిత్రాలను చిరంజీవికి అందించారు. “మంగమ్మ గారి మనవడు”, “ముద్దుల మావయ్య”, “భారతంలో బాలచంద్రుడు”, “ముద్దుల కృషుడు”, “మువ్వ గోపాలుడు” వంటి ఎన్నో అద్భుతమైన చిత్రాలను బాలకృష్ణ కి అందించారు. అసలు కోడి రామకృష్ణ సినిమా అంటే చాలు తెలుగు ప్రజలలో ఒక రకమైన క్రేజ్ పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరు చూడదగ్గ ఫ్యామిలీ సినిమాలు కూడా తీశారు కోడిరామకృష్ణ. ఆయనతో సినిమా చేసిన తరువాత ఆ హీరో ఇమేజ్ మారిపోయేది. హీరో రాజశేఖర్ కు యాంగ్రీ యుంగ్ మెన్ అనే టాగ్ ను అందించిన ఘనత ఆయనదే. అంకుశం సినిమాతో తెలుగునాట రాజశేఖర్ ఇమేజ్ నే మార్చేశారు. ఆయన డిమాండ్ అమాంతం పెంచేశారు. టాలీవుడ్లో ప్రతి ఒక్క హీరోకి కోడి రామకృష్ణతో అనుబంధం ఉంది. అందరూ హీరోలకి వారి కెరీర్ లో గుర్తుండిపోయే సినిమాలను అందించారు.

స్వర్గీయ కోడి రామకృష్ణ రెండో కుమార్తె ప్రవళ్ళిక మరియు సీహెచ్ మహేష్ లు గత అక్టోబర్ లో ఎంగేజ్మెంట్ జరుపుకున్న విషయం తెలిసిందే. అయితే పార్క్ హయత్ లో జరిగిన ఈ వేడుకకు టాలీవడ్ అతిరధ మహారధులు అందరు హాజరయ్యారు.

కోడి రామకృష్ణ చిన్న కూతురు వివాహం అంగరంగ వైభవంగా హైదరాబాద్, గండిపేటలోని కన్వెన్షన్ అండ్ ఎక్సిబిషన్స్ లో జరిగింది. బుధవారం రాత్రి 9:36 నిమిషాలు ప్రవళ్ళిక, మహేష్ లు ఒక్కటైయ్యారు. ఈ వేడుకకు తెలుగు చలన చిత్ర పరిశ్రమ తరలి వచ్చింది. రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు.

స్పెషల్ అట్రాక్షన్ చిరు, బాలయ్య
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం బాలకృష్ణ ఇద్దరు ఒకే వేదికపై కలిశారు. ఈ వేడుకలో ఇద్దరు కాసేపు పక్క పక్కనే కూర్చున్నారు. ఆ సమయంల్లో వీరిద్దరూ ఆనందంగా నవ్వుకుంటూ మాట్లాడుకున్నారు.

మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం బాలకృష్ణ, మోహన్ బాబు, కె. రాఘవేంద్ర రావు, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, మాజీ మంత్రి ఘంటా శ్రీనివాసరావు, అల్లు అరవింద్, మురళి మోహన్, గోపీచంద్, జయసుధ, జీవిత, రాజశేఖర్ కుమార్తె శివాని, దిల్ రాజు, కోదండ రామిరెడ్డి, కె. విజయ భాస్కర్, శివాజీ రాజా, వినోద్ కుమార్, అలీ, నాగబాబు, నాగబాబు సతీమణి పద్మజ, కుమార్తె నిహారిక, అలనాటి హీరో వినోద్ కుమార్, హేమ తదిరులతో పటు సినీ మరియు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

ఈ వివాహ వేడుక ఫోటోలు మీకోసం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here