Director & actor Samudrakhani : నేను చెప్పిన కథను త్రివిక్రమ్ మొత్తం మార్చేశాడు…: నటుడు & దర్శకుడు సముద్రఖని

0
174

Director & actor Samudrakhani : సాయి ధరమ్ తేజ్ తన మావయ్య పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి చేసిన సినిమా ‘బ్రో’. సినిమాకు సంబంధించిన ప్రొమోషనల్ కార్యక్రమాలను మొదలు పెట్టిన చిత్ర యూనిట్ ఆ సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆ సినిమా కథ డైరెక్షన్ మొత్తం సముద్రఖని చేసారు. ఆయన నటుడి కంటే ముందు డైరెక్టర్ కావడం వల్ల మరోసారి తమిళంలో సినిమా తీసి అదే సినిమాను ఎపుడు తెలుగులో రీమేక్ చేసారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన విషయాలను ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

నా కథ మొత్తం త్రివిక్రమ్ మార్చాడు…

బ్రో సినిమా కథ సముద్రఖని గారు వివరిస్తూ ఒక మనిషి భవిష్యత్ గురించి ఆలోచిస్తాడు కానీ వర్తమానంలో బతకాలనే విషయం మర్చిపోతాడు. ఈ రోజే నీది రేపు ఉందో లేదో తెలియదు అనే కాన్సెప్ట్ తో ఈ కథ రెడీ చేసానని చెప్పారు. అయితే స్క్రిప్ట్ వచ్చేసరికి బాగా లాగ్ ఉండటంతో త్రివిక్రమ్ గారు స్క్రిప్ట్ పనులు చూసుకున్నపుడు మొత్తం కట్ చేసి పది నిమిషాల్లో కథ సిద్ధం చేసారు. నేను చెప్పిన కథను మార్చేశారు. కానీ సినిమా బాగా వచ్చింది అంటూ చెప్పారు.

ఎక్కడో తమిళనాడు లోని మధురై కు 100 కిలోమీటర్లు దూరంలో ఉండే పల్లె నుండి చెన్నై, హైదరాబాద్ వచ్చిన నేను ఎలా రాగాలిగాను, నన్ను నడిపిన శక్తి ఏంటి అని ఆలోచించినపుడు మనం నెక్స్ట్ ఇయర్ ఏం చేయాలి ఎలా ఉండాలని ఆలోచిస్తుంటాం కానీ ఈరోజు మనల్ని ముందుకు నడిపింది ఏంటి అని ఆలోచించం. ఈరోజు బ్రతుకున్నదే మనది కదా అదే చెప్పాలి ప్రేక్షకులకు అని అనుకున్నా అంటూ బ్రో సినిమా గురించి వివరించారు. ఇందులో పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్, కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ కీలక పాత్రల్లో నటించారు.