Director Chandra Mahesh : తెలుగులో ఎంతోమంది కెరీర్ వెతుక్కుంటూ తమ ప్రతిభను నిరూపించుకోవాలని సినిమా ఇండస్ట్రీలోకి వస్తారు. అలా వచ్చిన వ్యక్తే చంద్ర మహేష్. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన చంద్ర మహేష్, సురేష్ ప్రొడక్షన్ హౌస్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసారు. ‘ధర్మచక్రం’ వంటి సినిమాకు పనిచేసిన చంద్ర మహేష్ ఆ తరువాత 1999లో శ్రీకాంత్ తో తీసిన ‘ప్రేయసి రావే’ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. అప్పట్లో ఈ సినిమా సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. అయితే ఆ హిట్ ను సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయాడు చంద్ర మహేష్. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి పలు అంశాలను ఆయన పంచుకున్నారు.

తరుణ్ ను తీసేసి వడ్డే నవీన్ ను తీసుకున్నాం…
మనసిచ్చి చూడు సినిమా హిట్ అయ్యాక చంద్ర మహేష్ మరో కథ సిద్ధం చేసుకుని అప్పటికే నువ్వే కావాలి సినిమాతో హిట్ కొట్టిన తరుణ్ హీరోగా సినిమా చేయాలని అనుకుంటే నిర్మాతకు హీరో తరుణ్ కి మధ్య ఇగో క్లాషెస్ వచ్చి ఆయన ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారట.

ఇక తొట్టెంపూడి వేణు ని అనుకుంటే ఆయనతో కూడా ఏవో బేదాభిప్రాయాలు రావడంతో ఆయన వద్దనుకుని చివరకు వడ్డే నవీన్ ను హీరోగా ఫైనల్ చేసాం. మొదట వడ్డే నవీన్ గురించి ఏవేవో అనుకున్నా ఆయన రిజర్వుడ్ గా ఉంటారు మాట్లాడరు అనుకుని ఆయనతో సినిమా అనేసరికి మొదట ఇష్టం లేదు. కథ చెప్పడానికి వెళ్ళగానే ఆయన పలకరించే విధానం అది చూసి బయట విన్నదానికి ఆయన ఉన్నదానికి చాలా తేడా ఉంది అని అర్థం అయింది. ఇక ఆయన హీరోగా రాశి హీరోయిన్ గా ఆ సినిమా చేసాం. మంచి విజయాన్ని అందుకుంది అంటూ చెప్పారు.






























