Director Geetha Krishna : నిత్యం వివాదాలతో సహజీవనం చేసే ఆర్జీవి ఈ మధ్య పాలిటిక్స్ మీద పడ్డాడు. అది కూడా ఏపీ రాజకీయాల మీద ఆయనకు ఉన్న ఇంటరెస్ట్ మరెవరికీ ఉండదు. మీరు రాష్ట్రానికి సీఎం అయితే ఏమి చేస్తారు అని అడిగితే పక్క రాష్ట్రానికి అమ్మేస్తాను అని చెప్పే ఆర్జీవి రాజకీయాల గురించి రాజకీయ నాయకుల గురించి విమర్శలు చేయడం విడ్డూరం. అయితే ఏపీ రాజకీయాల్లో వర్మ టార్గెట్ టీడీపీ, జనసేన. ఈ రెండు పార్టీలను తెగ విమర్శిస్తుంటారు వర్మ. అయితే అసలు వర్మ నాకు నచ్చే వ్యక్తి పవన్ కళ్యాణ్ అని చెబుతూ మరి పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన ను ఎందుకు తిడతారు అనే విషయాల మీద సీనియర్ డైరెక్టర్ గీతా కృష్ణ క్లారిటీ ఇచ్చారు.

వారినే టార్గెట్ చేసేది అందుకే…
వర్మ గురించి గీతా కృష్ణ మాట్లాడుతూ ఆయన ప్రాక్టికల్ గా చాలా బిజినెస్ మెంటాలిటీతో ఆలోచిస్తాడు. ఒకవేళ టీడీపీ కో లేక జనసేన కో సపోర్ట్ చేస్తే ఏమొస్తుంది అని లెక్కలేసుకొని మరీ వైసీపీ వైపు వెళ్లారు. వైసీపీ అధికారంలో ఉన్న పార్టీ అలానే బాగా డబ్బున్న పార్టీ. కాబట్టి వారి వ్యతిరేకులను తిడితే డబ్బు వస్తుందని ఆలోచించాడు.

ఊరికే ఉండే బదులు ఒక రూపాయి వచ్చినా అది లాభమే అని ఆలోచించే టైపు ఆర్జీవి అంటూ చెప్పారు. ఇక టీడీపీ ని అలాగే చంద్రబాబు ని బాగా విమర్శించినా ఆయన పెద్దగా పట్టించుకోరు. ఇక పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ కు ఆయనను తిడితే ఫాన్స్ నుండి స్పందన వస్తుంది, ఇదే కదా వర్మ కు కావాల్సింది అంటూ గీతా కృష్ణ అభిప్రాయపడ్డారు. అందుకే వర్మ తెలంగాణ లో కెసిఆర్, కేటిఆర్ లను అలానే ఏపీ లో జగన్ మోహన్ రెడ్దిలను అసలు ఏమీ మాట్లాడడు అంటూ వివరించారు.