Director Geetha Krishna : ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ను విమర్శించాలంటే ప్రత్యర్థుల అస్త్రం ఒకటే అదే ఆయన మూడు పెళ్లిళ్ల కథ. మూడు పెళ్లిళ్లు చేసుకున్న నువ్వు ఆడవాళ్లకు ఏమి విలువని ఇస్తున్నట్లు అంటూ విమర్శిస్తారు. పవన్ కళ్యాణ్ ముగ్గురు పెళ్ళాలలో అయితే రెండో భార్య రేణు దేశాయ్ గురించి అందరికీ తెలుసు. ఆమె బద్రీ సినిమాలో హీరోయిన్ గా పవన్ సరసన నటించింది కూడా. ఆ తరువాత చాలా ఏళ్ళు వాళ్లిద్దరూ సహజీవనం చేసారు, వాళ్లకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే చాలా ఏళ్లకు వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. అది ఎంతో కాలం నిలవలేదు మళ్ళీ పవన్ మూడో పెళ్లి ఒక రష్యా ఆమెను చేసుకున్నాడు. ఇదంతా పక్కన పెడితే మొదటి భార్య నందిని గురించి ఎవరికీ తెలియదు. ఆమె ప్రస్తుతం ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో కూడా తెలియదు. అయితే ఆమెకు బంధువైన డైరెక్టర్ గీతా కృష్ణ గారు ఆమె గురించి కొన్ని విషయాలను పంచుకున్నారు.

వాళ్ళ పెళ్లి అలా జరిగింది…
డైరెక్టర్ గీతా కృష్ణ గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ మొదటి భార్య నందిని తనకు బంధువంటూ చెప్పారు. గీతా కృష్ణ గారి అక్కను ఇచ్చింది పోలవరం అలాగే నందిని వాళ్లది పోలవరం అని, వాళ్లవి పెద్ద కుటుంబాలంటూ చెప్పారు. ఆ ఊర్లో పెద్ధ కుటుంబాలని వాళ్లకు పలుకుబడి ఉందంటూ చెప్పారు. నందిని చిన్న వయసులో ఉన్నపుడు నాగార్జున సినిమా షూటింగ్ వెళ్ళినపుడు వర్షం కారణంగా వాళ్ళ ఇంట్లో కూర్చునేవాళ్లమని అపుడు ఆ అమ్మాయిని చూసానని చిన్ని అని పిలిచేవాళ్ళం అంటూ చెప్పారు.

ఇక మరోసారి చూసానని అయితే పెళ్లి జరిగినపుడు నాకు తెలియదని చెప్పారు. ముంబై లో ఉండగా మళ్ళీ వాళ్ళ పెళ్లయ్యాక ఒకసారి నందిని వాళ్ళ నాన్న వచ్చినపుడు కలిసి ఆల్బమ్ చూపించారు. పెళ్లి వాళ్ళు గ్రాండ్ గా చేయాలని అనుకున్నా పవన్ ఒప్పుకోక పోవడం వల్ల చివరి నిమిషంలో షిరిడి లో సింపుల్ గా ఎవరికీ చెప్పకుండా చేసారు అంటూ చెప్పారు. ఇక వాళ్ళు వ్యక్తిగత కారణాలతో విడిపోయారంటూ చెప్పారు.



































