Director Geetha Krishna : ‘సంకీర్తన’ సినిమాతో మొదలై కోకిల, టైం, సర్వర్ సుందరం గారి అబ్బాయి వంటి విభిన్న సినిమాలతో వచ్చిన దర్శకుడు గీతా కృష్ణ ఎక్కువ సినిమాలు తీయలేదు. కేవలం తెలుగులో ఆరు సినిమాలు తీసిన ఆయన ఆ తరువాత మీడియా, జనానికి కనిపించకుండా పోయాడు. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో పలు చానెల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తూ హల్ చల్ చేస్తున్నాడు. సినిమా రంగలోని చాలా మంది సెలబ్రిటీల గురించి మాట్లాడుతూ వైరల్ అవుతున్నాడు.

రేణు దేశాయ్ ను ఇండస్ట్రీ కి పరిచయం చేసింది నేనే…
గీతా కృష్ణ గారు పలువురు సెలబ్రిటీల గురించి మాట్లాడుతూ సమంత, తమన్నా వంటి వారిని నేనే ఇండస్ట్రీకి పరిచయం చేసానని చెప్పారు. ఇక అలానే రేణు దేశాయ్ ని కూడా మొదట నేనే పరిచయం చేసినా ఈ విషయం ఎవరికీ తెలియదంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు. గీతా కృష్ణ గారికి మోడల్స్ ఫోటోలను కొంతమందిని అడిగినపుడు చాలా మంది మోడల్ ఫొటోస్ ను పంపగా అందులో రేణు దేశాయ్ ఫోటో తీసుకుని ముంబై వెళ్ళాక సుష్మ అనే మోడల్స్ బ్రోకర్ కు రేణు దేశాయ్ ఫోటో చూపించగా ఈ అమ్మాయి ఎందుకు తనకు చాలా పొగరు, ఆటిట్యూడ్ చూపిస్తుంది అని చెప్పిందట.

అయితే గీతా కృష్ణ ఆ ఫోటో వెనుక ఉన్న నెంబర్ కి కాల్ చేసి రేణు దేశాయ్ తో మాట్లాడి ఆడిషన్ కి రమ్మని చెప్పారట. నీకు పొగరని సుష్మ చెప్పింది అంటే తాను చేయమని చెప్పే చెత్త పనులను నేను చేయనని చెప్పా అందుకే అలా అనుంటుంది అంటూ చెప్పిందట రేణు. ప్రభుదేవాతో తీసే ‘టైం’ సినిమాలో రేణు ని ఒక హీరోయిన్ గా సెలెక్ట్ చేశారట గీతా కృష్ణ. అయితే అదే సమయంలో రేణు ఫెమినా కంపిటీషన్స్ కి ఎంపిక అవడంతో కుదరలేదట. ఇక రేణు ఫొటో చూసిన ప్రభుదేవా తన నెక్స్ట్ తమిళ సినిమాలో తనని పెట్టుకున్నారట, అలా రేణు ని సౌత్ కి పరిచయం చేసింది గీతా కృష్ణ గారేనట.































