Director Geetha krishna : నాగచైతన్య తో వివాహం జరిగి అక్కినేని కుటుంబానికి కోడలిగా వెళ్లినా కూడా సినిమాలను చేస్తూ తనని తాను ఛాలెంజింగ్ పాత్రలతో నిరూపించుకుంటూ వచ్చింది సమంత. అయితే ఇద్దరూ విడిపోయి విడాకులు తీసుకుని దూరంగా ఉంటున్నా ఎవరి కెరీర్ లో వాళ్ళు బిజీగా ఉన్నారు. విడాకుల తరువాత సమంత కెరీర్ స్లో అవుతుందని అనుకున్నా ఆమె మాత్రం రెట్టింపు స్పీడ్ తో దూసుకెళ్ళింది. ఒకవైపు పాన్ ఇండియా సినిమాలు చేస్తూ మార్కెట్ పెంచుకుంది. ఇక అంతా బాగుందనుకునే లోపే సమంతకు ఆటో ఇమ్మ్యూన్ సమస్యతో బాధపడుతున్నట్లు స్వయంగా తానే ప్రకటించడంతో ఒక్కసారిగా ఆమె అభిమానులు షాక్ అయ్యారు.

కష్టపడటం వల్ల ఎమోషనల్ అయ్యారు…
సమంత ‘యశోద’ సినిమా ప్రమోషన్స్ లో సుమతో ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో చాలా ఎమోషనల్ గా తన వ్యాధి గురించి మాట్లాడుతూ కన్నీరు పెట్టుకోవడం ఇదంతా బాగా వైరల్ అయింది. అయితే మరోసారి సమంత మళ్ళీ కన్నీరు పెట్టుకుంది. శాకుంతలం సినిమా ట్రైలర్ లాంచ్ వేడుకలో డైరెక్టర్ గుణశేఖర్ మాట్లాడుతున్న సమయంలో సమంత ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు.

ఈ విషయం గురించి గీతా కృష్ణ మాట్లాడుతూ తాను ఆటో ఇమ్మ్యూన్ వ్యాధితో పోరాడుతూనే సినిమాను పూర్తి చేసిన సమంత ఆ సినిమా ఇప్పుడు విడుదల అవ్వడానికి సిద్ధమవుతోంది కాబట్టి అలా ఎమోషనల్ అయింది. అంతే కాదు సినిమా పూర్తి అవడానికి చాలా కష్టపడ్డారు, షూటింగ్ చాలా రోజులు జరిగింది అందుకే బహుశా చిత్ర యూనిట్ ఎమోషనల్ అయ్యుండొచ్చు అంటూ చెప్పారు. ఇంతకుముందు యశోద సినిమా సమయంలో సమంత ఇలానే ఎమోషనల్ అయినపుడు చాలా మంది సినిమా కోసం డ్రామా చేస్తోంది అనుకున్నారు, నేను అలా అనుకున్నాను కానీ తాను చాలా ధైర్యంగా తనకొచ్చిన జబ్బుతో పోరాడుతూనే మరో వైపు మంచి సినిమాల్లో నటిస్తోంది అంటూ అభిప్రాయపడ్డారు.
































