Mahesh Babu -Prabhas: టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ హ్యాండ్సమ్ హీరోగా మహేష్ బాబు ముందు వరుసలో ఉంటారనే విషయం మనకు తెలిసిందే. ఇంత వయసు వచ్చిన మహేష్ బాబు చెక్కుచెదరని అందం వెనుక రహస్యం ఏంటి అంటూ ఇది వరకు ఎంతో మంది ఎన్నో సార్లు ప్రశ్నించారు. అయితే తాజాగా డైరెక్టర్ గీత కృష్ణ మహేష్ బాబు అందం గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న గీతాకృష్ణ సర్కారు వారి గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పాత కథలు కొత్త పేర్లు పెట్టి సినిమాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ సినిమాలను ప్రేక్షకులు ఆదరించ లేకపోతున్నారని గీతాకృష్ణ వెల్లడించారు. ఇకపోతే మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమాలో మహేష్ బాబు వింటేజ్ లుక్ లో ఉన్నారంటూ కొందరు రివ్యూ ఇచ్చారు.

ఈ విషయంపై గీతాకృష్ణ మాట్లాడుతూ వింటేజ్ లుక్ ఏంటీ అప్పటికీ ఇప్పటికీ మహేష్ బాబు విగ్ స్టారే… ఆయనకు విగ్ తప్పా అందం ఏమీ లేదు.. ఇండస్ట్రీలో దాదాపు అందరూ విగ్ స్టార్లే అంటూ ఈయన షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇకప్రభాస్ గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఎత్తు పెరిగాడు కానీ బుర్ర లేదు…
ఇండస్ట్రీలో ప్రభాస్ యంగ్ కుర్రాడని, ఆయన కూడా విగ్ పెట్టుకోడు అంటూ గీత కృష్ణ తెలిపారు. ప్రభాస్ తన బాడీ కటౌట్ తన హెయిర్ అంతా చాలా బాగుంటుంది. ప్రభాస్ చూడటానికి బాగా ఉంటాడు. ఇలా ప్రభాస్ ఎంతో ఎత్తు పెరిగాడు కానీ ఆయనకు బుర్ర మాత్రం లేదంటూ ప్రభాస్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ బుర్ర లేకపోవడంతో ఎలాంటి సబ్జెక్ట్ చేయాలి అనే విషయం తెలియడం లేదని గీతాకృష్ణ తెలిపారు.ఈ విధంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ పాపులర్ హీరోల గురించి ఈ విధమైనటువంటి సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఈయన చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.





























