Director Geetha Krishna : సీఎం జగన్ పార్టీ లో చాలా రోజులుగా ఉన్న కమెడియన్ అలీ అలాగే పోసాని కృష్ణ మురళి గారికి కొత్త పదవులను ఇచ్చారు. కమెడియన్ అలీ కి ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా విభాగాలని చూసుకోమని అలాగే పోసాని కృష్ణమురళి గారికి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ని ఇచ్చాడు జగన్. ఇక పవన్, చంద్రబాబు టార్గెట్ గానే ఈ పదవులను వారికి ఇచ్చారంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే అలీకి పవన్ కళ్యాణ్ కి మధ్య సత్సంబందాల నేపథ్యంలో అలీ పవన్ మీద విమర్శలు చేస్తారా అనే విషయంలో చర్చలు బాగా జరుగుతున్నాయి. ఇక ఏ ఈ విషయాల మీద సీనియర్ డైరెక్టర్ గీతా కృష్ణ అభిప్రాయాలను తెలిపారు.

కుక్క బిస్కెట్లు వేశారు…
అలీ, పోసాని కి జగన్ కుక్క బిస్కెట్లు వేసాడంటూ గీతా కృష్ణ అభిప్రాయపడ్డారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు లను విమర్శించడానికే వీరికి పదవులను ఇచ్చారు. ఇక వీరి వల్ల ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి పార్టీ కి ఏదో లాభం ఉంటుందని నేను అనుకోవడం లేదు. పోసానిని ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ను చేయడం ద్వారా సినిమా వాళ్లతో ప్రభుత్వం చర్చించడానికి మధ్యలో పోసానిని పెడతారు. వీళ్ళు సినిమాల్లో పెద్దగా చేసిందేమి లేదు కాట్రే, రాజా అంటూ వాళ్ళకొచ్చిన కామెడీ చేసారు.

ఇప్పుడు ఈ పదవుల ద్వారా వాళ్ళు సంపాదించుకుంటారు కానీ సినిమా ఇండస్ట్రీ కో వైసీపీ పార్టీ కో పెద్దగా ఉపయోగం ఉండదు. బాగా సంపాదించుకుంటే మళ్ళీ ఒక రాజ్యసభ సీటు లాంటింది కొంటారు అంటూ కామెంట్స్ చేసారు. కమెడియన్ అలీ కి సోషల్ మీడియాలో వ్యూయర్ షిప్ బాగానే ఉంది, యూట్యూబ్ లో ఏవైనా ఇంటర్వ్యూలు పెడితే బాగానే జనాలు చూస్తున్నారు కాబట్టి ఆయనని పార్టీ కి వాడుకోవచ్చు అంటూ అభిప్రాయపడ్డారు.
































