Director Geethakrishna : నందమూరి ఇంటి నుండి నాటవారసులుగా బాలకృష్ణ తరువాత వచ్చిన తారక రత్న, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లలో జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు అగ్ర హీరోగా ఎదిగాడు. నటన డాన్స్ వీటిలో ఎన్టీఆర్ కు ఎవరూ పోటీకాదు అన్నట్లుగా తన టాలెంట్ నిరూపించుకున్నాడు ఎన్టీఆర్. ఇక తారక రత్న ఒకేసారి తొమ్మిది సినిమాలకు ఓకే చేసినా అందులో హిట్ అయినవి చాలా అరుదు. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో విలన్ గా మెప్పించినా ఈ మధ్య సినిమాల గురించి ఆలోచించకుండా పాలిటిక్స్ వైపు చూస్తున్నాడు. ఇక హరికృష్ణ తనయులుగా ఇండస్ట్రీలోకి వచ్చినవారు జూనియర్ ఎన్టీఆర్ అలానే కళ్యాణ్ రామ్. కళ్యాణ్ రామ్ మాత్రం హిట్ ఫ్లాప్ సంబంధం లేకుండా తనకు నచ్చిన కథలను ప్రయోగాత్మక చిత్రాలను తీస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు. అలా తాజాగా నటించిన ‘బింబిసార’ సినిమాతో సాలిడ్ హిట్ అందుకుని నెక్స్ట్ సినిమాలపై ఫోకస్ చేసాడు.

తమ్ముడికి పోటీ కానున్న కళ్యాణ్ రామ్…
ప్రస్తుతం కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఆ సినిమా కు సంబంధించిన ట్రైలర్ ఇటీవలే విడుదల కుడా అయింది. డోపులర్ గ్యాంగర్ అనగా మనిషిని పోలిన మనిషులుగా అచ్చం కళ్యాణ్ రామ్ లాగే ఉన్న ముగ్గురు వ్యక్తుల కథగా వస్తోన్న ఈ సినిమా ట్రైలర్ ఆకట్టుకుంది, మూడు పాత్రలతో కళ్యాణ్ రామ్ ఆకట్టుకున్నాడు. అలా మూడు పాత్రలతో మెప్పించిన కళ్యాణ్ రామ్ తన తమ్ముడు ఎన్టీఆర్ కు పోటీ ఇవ్వనున్నాడా అనే సందేహాలు మొదలయ్యాయి.

వీటి గురించ్జి డైరెక్టర్ గీతా కృష్ణ మాట్లాడుతూ కళ్యాణ్ రామ్ లేట్ గా క్లిక్ అయ్యాడు, రవితేజ లాగా తానలోనూ మంచి నటుడు ఉన్నాడు. కథల ఎంపిక లో చాలా శ్రద్ధ తీసుకునే కళ్యాణ్ రామ్ బింబిసార సినిమాతో తను నటుడుగా ఒక మెట్టు ఎదిగాడు అలాగే తన తమ్ముడికి ఏమి తీసిపోనని నిరూపించాడు. ఇక నటన, డైలాగలను చెప్పడం నందమూరి వారి బ్లడ్ లోనే ఉంది, బయట మాట్లాడేటపుడు తడబడే బాలకృష్ణ డైలాగులు మాత్రం ఆదరగొడతాడు అంటూ చెప్పారు. ఇక కళ్యాణ్ రామ్ బింబిసార తరువాత మంచి ప్రొజెక్ట్ ఎంపిక చేసుకుంటే తన మార్కెట్ మరింత పెంచుకున్నట్లవుతుంది అయితే ఇప్పటికిప్పుడు ఎన్టీఆర్ కి పోటీ అయితే రాలేడు అంటూ తెలిపారు.































