Krish: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో కొనసాగే సెలబ్రిటీలు రెండు మూడు పెళ్లిళ్లు చేసుకోవడం అనేది సర్వసాధారణంగా జరుగుతుంది. ఇటీవల కాలంలో సెలెబ్రెటీలు మాత్రమే కాదు సాధారణ వ్యక్తులు కూడా రెండు మూడు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.. ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న క్రిష్ జాగర్లమూడి సైతం రెండో పెళ్లి చేసుకున్నారు.

గత కొద్దిరోజులుగా ఈయన రెండో పెళ్లికి సంబంధించి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న ఎక్కడ స్పందించిన దాఖలాలు లేవు అయితే నిన్న ఈయన కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వీరి వివాహానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
డైరెక్టర్ క్రిష్ హైదరాబాద్ కి చెందిన గైనకాలజిస్ట్ చల్లా ప్రీతి అనే వైద్యురాలిని వివాహం చేసుకున్నారు. ఇక వీరి పెళ్లి ఫోటోలను వీరిద్దరూ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ కొత్త ప్రయాణం మొదలైందని తెలియజేశారు. ఇక ఈయన 2016 వ సంవత్సరంలో డాక్టర్ రమ్య అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లైన కొద్ది రోజులకే వీరిద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చి విడాకులు తీసుకొని విడిపోయారు.
ఇద్దరూ డాక్టర్లే..
అప్పట్లో డైరెక్టర్ క్రిష్ మరొక హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకోవడం వల్ల రమ్య విడాకులు ఇచ్చిందన్న వార్తలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఇలా మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన ఈయన రెండో వివాహం చేసుకున్నారు. ఈయన రెండు పెళ్లిళ్లు చేసుకోగా ఇద్దరు కూడా డాక్టర్లు కావటం విశేషం. అయితే ప్రీతికి 11 సంవత్సరాల వయసుగల కుమారుడు కూడా ఉన్నారు అంటూ వార్తలు వస్తున్నాయి మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.




























