Director Maruthi father died: డైరెక్టర్ మారుతీ తెలుగులో ఇపుడిపుడే డైరెక్టర్ గా లేదా హీరోలతో సినిమా అవకాశాలను అందుకుంటున్నారు. మారుతీ చిత్రాలన్నీ కూడా హాస్యభరితంగా ఉంటాయి. బస్ స్టాప్ సినిమాతో మొదలై కొత్త జంట, బాబు బంగారం, భలే భలే మగాడివోయ్, మహానుభావుడు, శైలజ రెడ్డి అల్లుడు, ప్రతి రోజు పండగే సినిమాలకు దర్శకత్వం వహించి మంచి హిట్లు అందుకున్నాడు.

ఇక డైరెక్టర్ మారుతీ ఇంత విషాదం అలుముకుంది. మారుతీగారి తండ్రి మారుతీ తండ్రి దాసరి వన కుచలరావు గురువారం కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని స్వగృహంలో కన్నుమూశారు. 76 సంవత్సరాల కుచలరావు గారి మరణవార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు ఆయన్ని పరామర్శించి సంతాపం వ్యక్తం చేశారు.
ఇక నిర్మాత గా మారి ప్రేమ కథా చిత్రమ్ సినిమా ను నిర్మించి విజయం అందుకున్నారు. ఇక మారుతీ ప్రస్తుతం గోపీచంద్ తో పక్కా కమర్షియల్ సినిమా చేస్తున్నారు. దీని తర్వాత హీరో ప్రభాస్ తో ఒక సినిమా చేయనున్నారు.ఇక ఈ సినిమాలు హిట్ అయితే మారుతీ టాప్ డైరెక్టర్స్ లిస్టులోకి వెళ్ళిపోతారు.































