Director Nandam Harischandra rao : కమల్ హాసన్ కి ఎం చెప్పాలో అర్థం కాలేదు.. రజని కాంత్ పొద్దున్నే దాసరి గారి కారు ఆపి వేషం అడిగాడు…: దర్శకుడు నందం హరిశ్చంద్ర రావు

0
81

Director Nandam Harischandra rao : దాసరి గారి శిష్యుడు గా తెలుగు ఇండస్ట్రీలో డైరెక్టర్ గా వచ్చిన వారిలో నందం హరిశ్చంద్ర రావు ఒకరు. 1973లో ఇండస్ట్రీ లోకి చాలా యాద్రచ్చికంగా వచ్చారు. తండ్రి స్నేహితుడైన ఏంకే మౌళి అనే ఆయన అప్పటికే నిర్మాతగా తెలుగులో “స్వర్గం నరకం” సినిమా తీశారు. ఆయన దాసరి గారికి బాగా సన్నిహితంగా ఉండేవారు. బావ గారు చెల్లి అంటూ దాసరి గారిని ఆయన భార్యను పిలిచేవారట మౌళి గారు. అలా ఆయన ద్వారా దాసరి వద్దకు చేరానని హరిశ్చంద్ర గారు వివరించారు. అప్పటికి దాసరి గారు తాత మనవడు సినిమా మంచి హిట్ తో ఉండగా ఆయన నెక్స్ట్ సినిమా సంసార సాగరం సినిమాకు అసిస్టెంట్ గా కెరీర్ మొదలు పెట్టిన హరిశ్చంద్ర గారు ఇక అప్పటి నుండి దాసరి గారి వెన్నంటే ఉన్న శిష్యులలో ఒకరు. అలా ఆయన జీవితం గురించి పుస్తకం రాసారు హరిశ్చంద్ర రావు గారు. అలా దాసరి గారి జీవితంలోని కొన్ని సంఘటనలను ఆయన తాజాగా ఒక ఇంటర్వ్యూ లో తెలిపారు.

కమల్ హాసన్ కు ఏమి చేయాలో తెలియలేదు… రజని అలా వేషం అడిగాడు…

దాసరి గారు తీసిన మొదటి రెండు సినిమాలతోనే మంచి హిట్స్ అందుకుని అందరి దృష్టిని ఆకర్శించారని ఇక ఆయన ఒక కథ రాసుకుని అపుడే పైకి వస్తున్న కమల్ హాసన్ ను తెలుగులో పరిచయం చేయాలనీ భావించి ఆయనను ఒకే చేసాడు. అయితే ఇలా దాసరి గారితో సినిమా చేయాలనుకుంటున్న విషయం ఆయన గురువు బాలచందర్ గారికి చెప్పడానికి కమల్ ఆయన ఆఫీస్ కి వెళ్లగా ఆయన కూడ కమల్ కోసం కథ రాస్తుండటం తెలుగులో మొదట సినిమా తీయాలనీ అనుకోవడంతో కమల్ ఆయనకు ఈ విషయం చెప్పలేకపోయారట. ఇక ఆయన సినిమా ఒకేనని చెప్పి మళ్ళీ ఇలా జరిగింది అని ఆ విషయం చెప్పడానికి దాసరి గారి వద్దకు వచ్చి జరిగిన విషయం చెప్పగా దాసరి గారు చాలా హుందాగా నేను నిన్ను తెలుగులో పరిచయం చేయాలనీ అనుకున్న నువ్వు కాకపోతే మరో వ్యక్తిని పరిచయం చేస్తాను మీ గురువు గారు తమిళంలో కాకుండా తెలుగులో మొదట సినిమా తీయాలనీ అనుకుంటున్నారు చాలా ఆనందంగా ఉంది అంటూ చెప్పారట. అలా కమల్ మరో చరిత్ర సినిమా ద్వారా తెలుగులో అడుగుపెట్టారు.

కమల్ చేయాల్సిన కన్యాకుమారి సినిమాలో నరసింహారాజు హీరోగా చేసారు. ఇక తమిళంలో హిట్ అయినా సినిమాను తెలుగులో తీయాలనీ దాసరి భావిస్తుండగా తమిళంలో రజని కాంత్ చేసిన పాత్రను తెలుగులో మోహన్ బాబు చేత వేయించారు. అయితే మోహన్ బాబు వేసిన ఆ క్యారెక్టర్ తననే తీసుకోమని అవకాశం ఇవ్వమని రజని కాంత్ దాసరి గారు ఉంటున్న ఇంటి వద్దకు వచ్చి కారులో వెళ్తుండగా అడిగారట. అయితే అప్పటికే మోహన్ బాబును అనుకోవడం వల్ల నిన్ను తీసుకోలేను కానీ నీతో మళ్ళీ ఖచ్చితంగా సినిమా చేస్తా అని మాటిచ్చారట. కానీ ఆపైన రజని బిజీ అవడం వల్ల ఇద్దరి కాంబినేషన్ కుదరలేదు. ఒక సినిమా అపుడు రజనికాంత్ ను అడుగగా కాల్షీట్ సర్దుబాటు చేయలేక కుదరలేదట. ఇలాంటి విశేషాలను నందం హరిశ్చంద్ర రావు గారు దాసరి గారి గురించి రాసిన పుస్తకంలో పొందుపరిచారు.