Director Nandam Harischandrarao : దాసరి గారి శిష్యుడుగా తెలుగు ఇండస్ట్రీలో డైరెక్టర్ గా వచ్చిన వారిలో నందం హరిశ్చంద్ర రావు ఒకరు. 1973లో ఇండస్ట్రీలోకి చాలా యాద్రచ్చికంగా వచ్చారు. తండ్రి స్నేహితుడైన ఎంకే మౌళి అనే ఆయన అప్పటికే నిర్మాతగా తెలుగులో స్వర్గం నరకం సినిమా తీశారు. ఆయన దాసరి గారికి బాగా సన్నిహితంగా ఉండేవారు. బావ గారు చెల్లి అంటూ దాసరి గారిని ఆయన భార్యను పిలిచేవారట మౌళి గారు. అలా ఆయన ద్వారా దాసరి వద్దకు చేరానని హరిశ్చంద్ర గారు వివరించారు. అప్పటికి దాసరి గారు తాత మనవడు సినిమా మంచి హిట్ తో ఉండగా ఆయన నెక్స్ట్ సినిమా సంసార సాగరం సినిమాకు అసిస్టెంట్ గా కెరీర్ మొదలు పెట్టిన హరిశ్చంద్ర గారు అప్పటి నుండి దాసరి గారి వెన్నంటే ఉన్న శిష్యులలో ఒకరు. అలా ఆయన జీవితం గురించి పుస్తకం రాసారు హరిశ్చంద్ర రావు గారు. అలా దాసరి గారి జీవితంలోని కొన్ని సంఘటనలను ఆయన తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.

ఎస్వి రంగారావు గారికి కోపం వచ్చింది…
దాసరి నారాయణ రావు గారు తన మొదటి సినిమాను తాత మనవడు పేరుతో రాజబాబు, ఎస్వి రంగారావు గార్లను ముఖ్య పాత్రలలో పెట్టి సినిమా తీసి హిట్ కొట్టారు. ఇక ఆ సినిమా తరువాత సంసారం సాగరం అనే సినిమాను దాసరి గారు డైరెక్ట్ చేయగా నిర్మాత రాఘవ గారే మళ్ళీ ఈ సినిమాను నిర్మించారు. అయితే ఇందులో ఎస్వి రంగారావు గారికి పెద్ద డైలాగ్ ఒకటి రాయగా ఆయన ఎమోషనల్ సీన్ లో ఆ డైలాగ్ అవసరం లేదు అంటూ ఆ నాలుగు పేజీల డైలాగులను కుదించి పడేసారట. దాసరి గారు వచ్చి లేదు సీన్ లో ఆ డైలాగులు ఉండవలసిందే అని చెబితే ఎస్వి రంగారావు గారికి కోపం వచ్చి అక్కడి నుండి కారులో వెళ్లిపోయారట. నిర్మాత రాఘవ రావు గారు ఎస్విఆర్ వెళ్లిపోయారని కంగారుగా దాసరి వద్దకు వచ్చి వేరే ఎవరినైనా చూద్దామా లేక ఎలా అంటూ అడిగితే దాసరి గారు ఆయన ఒక గోప్ప ఆర్టిస్ట్ ఆయన ఈ పాత్రను వదులుకోరు.

కాసేపట్లో అర్థం చేసుకుని ఆయనే తిరిగివస్తారు చూడండి అని చెప్పారట, అయితే రాఘవ రావు గారు మాత్రం బయటికి వచ్చి ఎస్వి రంగారావు గారికి నచ్చజెప్పి పిలుచుకు రావాలని బయలుదేరబోతుంటే అంతలో ఎస్విఆర్ గారే వచ్చి మంచి కుర్రాడిని డైరెక్టర్ గా పెట్టుకున్నావు. మంచి డైరెక్టర్ అవుతాడు అంటూ చెప్పి దాసరి గారిని నువ్వు ఇంకా డైలాగులు పెంచుకున్నా పర్వాలేదు నువ్వెలా చెబితే అలా సినిమా చేద్దాం అని చెప్పారట. అలా దాసరి గారికి కథమీద తన స్క్రిప్ట్ మీద ఉన్న పట్టు గురించి హరిశ్చంద్ర రావు గారు మాట్లాడారు.































