Director Pavan Sadineni : రాజశేఖర్ గారితో సినిమా మొదలు పెట్టి మధ్యలో ఆగిపోడానికి కారణం అదే…: డైరెక్టర్ పవన్ సాధినేని

0
110

Director Pavan Sadineni : ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాతో ఒక్కసారి తనవైపు ఇండస్ట్రీ చూసేలా చేసుకున్న డైరెక్టర్ పవన్ సాధినేని. విజయవాడ కు చెందిన పవన్ సాధినేని అమెరికా వెళ్లి తల్లిదండ్రుల కోసం ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూనే మరోవైపు తన ఇష్టాన్ని వదులుకోలేక షార్ట్ ఫిలిమ్స్ తీసాడు. అలా మంచి వ్యూస్ అందుకున్న పవన్ ఆ పైన సినిమాలను డైరెక్ట్ చేసి తొలి సినిమాతోనే మంచి హిట్ అందుకున్నాడు. ఆపైన సావిత్రి లాంటి ఫ్లాప్ అందుకున్నా సేనాపతి సినిమాతో మరోసారి మంచి పేరు తెచ్చుకున్నాడు. క్రైమ్ థ్రిల్లర్ తో మంచి హిట్ అందుకుని తాజాగా జేడి చక్రవర్తి మెయిన్ లీడ్ గా ‘దయ’ అనే వెబ్ సిరీస్ తో మరోసారి మంచి హిట్ అందుకున్నాడు. త్వరలోనే పెద్ద ప్రాజెక్ట్ చేయబోతున్న పవన్ సాధినేని తన కెరీర్ గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు.

అందుకే సినిమా ఆపేసాం…

రాజేశేఖర్ గారితో పూర్తి యాక్షన్ చిత్రం తీయాలని పవన్ సాధినేని అనుకుని రాజశేఖర్ గారికి కథ చెప్పి అంతా ఓకే అయ్యాక సినిమా మొదలు పెట్టలేదు. దీనికి కారణాలను ఇటీవల ఇంటర్వ్యూలో పవన్ సాధినేని వివరించారు. సినిమా మొత్తం యాక్షన్ పార్ట్ ఎక్కువగా ఉంటూ టాకీ పార్ట్ తక్కువగా ఉంటుంది. గంటా 45 నిమిషాల పాటు యాక్షన్ సీన్స్ ఉండేలా సినిమా డిజైన్ చేసాము. సినిమాలో హీరోయిన్, పాటలు లాంటివి ఏమీ ఉండవు. అయితే సినిమా ప్లాన్ చేసినపుడే బడ్జెట్ ఎంత అవుతుందో చెప్పేస్తాను, మొదలు పెట్టాక ఇంకెక్కడికి పోతారు అన్నట్లు బడ్జెట్ పెంచడం నా స్టైల్ కాదు.

అందుకే సినిమా మొదలు పెట్టాలనుకున్నపుడే బడ్జెట్ చెప్తే నిర్మాతలు సరిగా దొరకలేదు. ఇక ఆ గ్యాప్ లో రాజశేఖర్ గారి ‘శేఖర్’ సినిమా విడుదల అయి సరిగా స్పందన రాలేదు. ఇక అందుకే కొంచం గ్యాప్ తీసుకోవాలని అనుకున్నాం అంతే కానీ ప్రాజెక్ట్ ను ఆపేయలేదు. ఒక పెద్ద బ్యానర్ మీదనే సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాం అంటూ ఆలోపు ముందు ఒప్పుకున్న కమిట్మెంట్స్ పూర్తి చేయాలని అనుకుంటున్నట్లు పవన్ సాధినేని తెలిపారు.