Director PNR : పి ఎన్ రాంచంద్రం రావు…. దర్శకుడిగా నిర్మాతగా తెలుగు, కన్నడ, తమిళ్ లో ఎన్నో సినిమాలను తీసారు. కొత్త నటులను పరిచయం చేయడంలో కూడా ముందుంటారు. ‘మానవరాలి పెళ్లి’ సినిమాతో సౌందర్య ను, ‘సహనం’ సినిమాతో విలన్ గా ప్రకాష్ రాజ్ ను, ‘లీడర్’ సినిమాతో ప్రియారామాన్ ను, ‘జాక్ పాట్’ సినిమాతో నవీనను, ‘గోల్ మాల్’ సినిమాతో నేహా, మీరా వాసుదేవన్ ను తెలుగు తెర కు పరిచయం చేశారు. అంతేకాకుండా సినిమాలలో హీరోగా కనిపించే ముందు ఎన్టీఆర్ ను ‘భక్త మార్కండేయ’ అనే తెలుగు సీరియల్లో చూపించారు. తాజాగా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న పిఎన్ఆర్ తాను సినిమాలలో నష్టపోయిన దాని గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పారు.

ఆ నిర్మాత నన్ను ముంబాయి నడిరోడ్డిలో వదిలేసాడు…..
ఎన్టీఆర్ తో సీరియల్ తీసిన చనువుతో ఎన్టీఆర్ ఇచ్చిన మాట ప్రకారం ఎన్టీఆర్ తోనే సినిమా చేయాలనీ ఎదురుచూసారట. అయితే ఎన్ని అవకాశాలు వచ్చినా, ఎంతమంది అవహేళన చేసినా ఒకసారి జీవితంలో చేసిన తప్పు మళ్ళీ చేయకూడదు అని ఎన్టీఆర్ తోనే సినిమా చేయాలని దృఢ నిశ్చయంతో వున్నారట. కానీ ఆ సమయంలో మూడు నాలుగు ఏళ్ళు గడిచాక, ఒక నిర్మాత వచ్చి కలవడంతో, ఇలా అవకాశం వచ్చింది ఎలా అని ఎన్టీఆర్ ని అడుగగా… అందుకు ఎన్టీఆర్ ఈ ప్రాజెక్ట్ చేయండి సక్సెస్ అవుతారు, నేనే వచ్చి క్లాప్ కొడతాను అని ప్రోత్సహించారట. అనుకున్నట్టుగానే అన్ని జరిగాయి అని చెప్పుకొచ్చారు.

ఆ సినిమాకు జేడీ చక్రవర్తి హీరోగా, మరొక హీరో గా కన్నడ హీరోని ఎంచుకోగా, ముంబాయి కి వెళ్లి లొకేషన్ చూసుకోవాలి అన్న తరుణంలో నిర్మాత హ్యాండ్ ఇచ్చారట. దాంతో మొత్తం భారం తన మీద వేసుకొని సినిమాను గట్టెంకించి, 3 కోట్లు నష్టపోయాను అని తన భాద ను తెలియజేసారు.



































