Director R. Parthiban : తమిళ సినిమా దర్శకుడు పార్థిబన్ ఆయన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూనే నటుడుగా కూడా మెప్పించాడు. భారతి రాజా శిష్యుడిగా తమిళ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఆయన దర్శకుడిగా మంచి సినిమాలను అందించారు. అయితే తెలుగు ప్రేక్షకులకు మాత్రం యుగానికి ఒక్కడు సినిమా ద్వారా సుపరిచితుడు. మొదటి సరిగా ఆయన తెలుగు ఇంటర్వ్యూ లో ఆయన వ్యక్తిగత అలాగే వృత్తి పరమైన విషయాలను పంచుకున్నారు.

సీత తో ప్రేమ, పెళ్లి, విడాకులు…
ఒకపప్తి సినిమాల్లో హీరోకు చెల్లిగా, చిన్న సినిమాల్లో హీరోయిన్ గా ప్రస్తుతం తల్లి పాత్రలతో మెప్పిస్తున్న నటి సీతను ప్రేమించి డైరెక్టర్ పార్థిభన్ పెళ్లి చేసుకున్నారు. అయినా మొదటగా దర్శకత్వం వహించిన సినిమా పుదీయా పాదయ్ సినిమాలో హీరోయిన్ గా నటించారు. ఆ పరిచయంతో ఇద్దరు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. పిల్లలు పుట్టాక అభిప్రాయ బేధలతో విడాకులు తీసుకున్నారు. అయితే విడాకులు తీసుకుని 22 ఏళ్ళు అయినా ఇప్పటికి మళ్ళీ పార్థిభన్ పెళ్లి చేసుకోలేదు. భార్య స్థానం ఇంకెవరికి ఇవ్వలేనంటూ ఆయన ఇంటర్వ్యూ లో చెప్పారు.
ఇక ఇద్దరు ఆడపిల్లలు ఒక అబ్బాయి ముగ్గురు అలాగే అల్లుడు కూడా సినిమా ఇండస్ర్టీలోనే ఉన్నారంటు చెప్పారు పార్థిభన్. డైరెక్షన్ ఫీల్డ్ ఎంచుకున్నారని చెప్పారు. కూతురు కీర్తన కు ఒక సినిమాలో నటనకు చైల్డ్ ఆర్టిస్ట్ గా నేషనల్ అవార్డు తీసుకున్నారట. రీసెంట్ గా పెద్దమ్మయి పెళ్లి చేసానంటూ చెప్పారు. విడిపోయిన పిల్లల బాధ్యత ఇద్దరం తీసుకున్నట్లు తెలిపారు. ఇక ఒక అబ్బాయిని దత్తత తీసుకుని పెంచుకుంటున్నారు. అలా ముగ్గురు పిల్లల బాధ్యతలతో హ్యాపీగా ఉన్ననని రీసెంట్ పవన్ కళ్యాణ్ గారిని మర్యాదపూర్వకంగా కలిసినట్లు ఆయనకోసం స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్లు తెలిపారు.
Latest Videos :



























