Rajamouli shake legs for natu natu song : ఆర్ఆర్ఆర్ సినిమా ఏ రేంజ్ హిట్ అయిందో అందరికి తెలుసు.రికార్డులను బద్దలు కొడుతూనే ఉంది. ఇక దేశమంతా ఆర్ఆర్ఆర్ మనియా నడుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా మంచి వసూళ్ల తో పాటు రామ్ చరణ్ ఎన్టీఆర్ లకు మంచి పేరు కూడా తెచ్చింది.ఇక సినిమాలోని నాటు నాటు సాంగ్ గురించి చెప్పక్కరలేదు. థియేటర్లో ఆ పాట వచ్చినపుడు థియేటర్స్ మొత్తం ఉగిపోయింది. ఫ్యాన్స్ రచ్చ మాములుగా చేయలేదు.

నాటు నాటు స్టెప్పులేసిన అనిల్, రాజమౌళి….
నాటు నాటు పాట కోసం ఎన్టీఆర్ రామ్ చరణ్ పడిన కష్టం గురించి ప్రొమోషన్స్ లో వాళ్ళు చెప్పారు. దాదాపు 17 టేకులు తీసిన తర్వాత గాని రాజమౌళి ఓకే చేయలేదట. ఈ విషయాన్నీ ఎన్టీఆర్ ప్రస్తావిస్తూ రాజమౌళి తో ఆ డాన్సు చేయిస్తానని మాటిచ్చాడు. ప్రొమోషన్స్ లో ఎక్కడ రాజమౌళి డాన్సు వేయలేదు అందుకే ఎన్టీఆర్ అలా అన్నారు. ఇక ఆ మాట ఇపుడు నిజం చేసారు. ఆర్ఆర్ఆర్ సినిమా ఘన విజయం కావడంతో సక్సెస్ పార్టీ ని ఏర్పాటు చేసారు.ఈ కార్యక్రమానికి దిల్ రాజు వాఖ్యతగా వ్యవహరించగా ఈ ఈవెంట్ లో ఎన్టీఆర్ రాజమౌళి అనిల్ రావిపూడి లతో నాటు నారు పాటకు డాన్సు చేయించారు. ఇలా రాజమౌళి పై పగ తీర్చుకున్నాడు ఎన్టీఆర్. అయితే రాజమౌళి, అని రావిపూడి లు మాత్రమే నాటు నాటు స్టెప్పులు ఇరగదిసారు పర్ఫెక్ట్ సింక్ లో వేసి ఆశ్చర్యపరిచారు. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియా లో వైరల్ అయింది.






























