Director Ram Gopal Varma : సినిమా ఇండస్ట్రీలో అది బాలీవుడ్ అయినా టాలీవుడ్ అయినా రామ్ గోపాల్ వర్మ పరిచయం అక్కర్లేని పేరు. సినిమా హిస్టరీ తీస్తే వర్మ సినిమాలకు సెపరేట్ పేజీ ఉండాల్సిందే. ఇండియన్ సినిమాకు కొత్త ట్రెండ్ ను పరిచయం చేసిన అద్భుత టెక్నిషియన్ వర్మ. శివ, రంగీలా, గాయం, గోవిందా గోవింద, సత్య ఇలా దేనికవి భిన్నంగా చిత్రాలను తీసి అన్నింటా తన మార్క్ ఆలోచనలను జనం ముందు ఆవిష్కరించి శభాష్ అనిపించుకున్నాడు. తాను డైరెక్ట్ చేసిన సినిమా విశేషాలను అందిస్తూ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో ఇటీవల రంగీలా సినిమా విశేషాలను పంచుకున్నారు వర్మ.

ఊర్మిళతో ప్రేమలో పడిపోయాను…
రంగీలా సినిమా చేయడానికి మెయిన్ కారణం ఊర్మిళ అంటూ వర్మ రీసెంట్ ఇంటర్వ్యూలో తెలిపారు. ఊర్మిళ తో అంతకుముందు అంతం, గాయం సినిమాలు చేసినా గాయం సినిమాలో ఒక పాటకు తాను కోరియోగ్రఫి చేయడంతో నాకు రంగీలా సినిమాను తనతో తప్ప ఇంకెవరితోనూ చేయకూడదు అనే నిర్ణయం తీసేసుకున్నా అంటూ చెప్పారు. ఇక సినిమా అప్పట్లో మంచి కలెక్షన్స్ సాధించి దాదాపు 33 కోట్ల గ్రాస్ రాబట్టిందనే వార్తలను గురించి మాట్లాడిన ఆర్జీవి అప్పట్లో లావాదేవీలన్నీ క్యాష్ తో నడిచేవి కాబట్టి ఎంత వసూళ్లు జరిగాయో ఖచ్చితంగా చెప్పలేను.

కానీ నాకైతే ఒక్కరూపాయి కూడా లాభం రంగీలా సినిమా నుండి రాలేదంటూ చెప్పారు వర్మ. అయితే ఆ సినిమా క్రేజ్ వల్ల ‘దౌడ్’ సినిమాకు ఎక్కువ డబ్బులు వచ్చాయి. దౌడ్ సినిమా ఫ్లాప్ అయినా నాకు డబ్బు బాగా వచ్చింది. సినిమా హిట్ ఫ్లాప్ కన్నా ఒక టెక్నిషియన్ ముందు సినిమా హిట్టా ఫ్లాపా అన్నది ఇండస్ట్రీలో రేట్ ను నిర్ణయిస్తారు అంటూ చెప్పారు.


































