‘శివ’ చిత్రంతో టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ ను క్రియేట్ చేసిన సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ కొత్తదనం కోసమే ఆరాటపడుతుంటాడు. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారడం రామ్ గోపాల్ వర్మకు కొత్తేమీ కాదు. తాజాగా ‘పవర్ స్టార్’ మూవీతో సంచలనం సృష్టించిన రామ్ గోపాల్ వర్మ ఈ చిత్రం విడుదలైన సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అయితే ఆ ఇంటర్వ్యూలో ‘మీరు ఇంతవరకూ నిర్మించిన చిత్రాలలోని కొందరు అమ్మాయిలను వాడుకున్నారట కదా!’ అని యాంకర్ అడిగిన ప్రశ్నపై కోపంతో రగిలిపోయారు.

ఆ తర్వాత ఆయనే సమాధానమిచ్చారు. వివరాల్లోకి వెళ్తే.. లేటెస్ట్ గా ‘పవర్ స్టార్’ మూవీతో రామ్ గోపాల్ వర్మ చేస్తున్న పబ్లిసిటీ స్టంట్ కి పగ్గం వేసేలా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ‘ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తూ సినిమాలు తీయడం మీకే కాదు మాకు కూడా తెలుసు’ అంటూ పవర్ స్టార్’కి పోటీగా ‘పరాన్నజీవి’ సినిమాను రూపొందించి గట్టి కౌంటర్ ఇచ్చారు. ఈ చిత్రంలో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ రియల్ క్యారెక్టర్ విలువలను తగ్గించే విధంగా కొన్ని సీన్స్ పెట్టేశారు. ఈ చిత్రంలో సినిమా ఛాన్స్ లు ఇస్తానని చెప్పి అమ్మాయిలను వాడుకుంటారనే విధంగా వర్మపై కొన్ని సన్నివేశాలను చూపించారు. ఈ నేపథ్యంలోనే ఒక ఇంటర్వ్యూలో వర్మకు ‘మీరు అమ్మాయిల జీవితాల్ని నాశనం చేశారని, వాళ్ళ బలహీనతలను అవకాశంగా తీసుకుని వాడుకుంటారనే రూమర్స్ మీపై వస్తున్నాయి. ఈ రూమర్స్ కి మీరు చెప్పే సమాధానం ఏమిటి.?’ అని యాంకర్ ప్రశ్నించడంతో ఉద్రేకంగా ఊగిపోయిన వర్మ ఆ తర్వాత సమాధానం ఇస్తూ.. ”అసలు ఇలాంటి డర్టీ రూమర్స్ ను మీకెవరు చెప్పారు.? రోడ్డుమీద ఎవడో ఏదో అనుకుంటే నమ్మేస్తారా.? పర్సనల్ లైఫ్ గురించి అడగడానికి అసలు మీరెవరు?” అంటూ ఆ యాంకర్ పై మండి పడ్డారు. ఇంకా ఆ ఇంటర్వ్యూను కొనసాగిస్తూ..

‘‘నా పర్సనల్ లైఫ్ కోసమో.. లేక నా సెక్స్ లైఫ్ కోసమో చర్చించడానికి నేనిక్కడకు రాలేదు. నేనిక్కడికి వచ్చింది కేవలం ‘పవర్ స్టార్’ మూవీ గురించి మాట్లాడతారని మాత్రమే వచ్చాను. కాబట్టి ఆ మూవీకి సంబంధించినవే అడగండి. ఈ ఇంటర్వ్యూలో వ్యక్తిగత విషయాల ప్రస్తావన వద్దు. అయినా నాకు తెలియక అడుగుతున్నాను.. నేను గతంలో వాడుకున్నానని, రామ్ గోపాల్ వర్మ నా జీవితం నాశనం చేశాడని.? ఏ అమ్మాయైనా వచ్చి మీతో చెప్పిందా.? లేదు కదా.. మరి అలాంటప్పుడు మీరు ఇలాంటి ప్రశ్నలు వేయడమేమిటి.?’’ అంటూ యాంకర్‌పై ఫైర్ అయ్యారు వర్మ. ఆ వెంటనే మైకు తీసేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతోంది.



























