హౌస్ వైఫ్ అంటే అస్సలు ఇష్టం ఉండదంటూ బోల్డ్ కామెంట్స్ చేసిన వర్మ !

0
423

టాలీవుడ్ లో విడుదలైన ‘శివ’, ‘క్షణ క్షణం’, ‘గులాబి’, ‘సత్య’, ‘రంగేలా’ వంటి సెన్సేషనల్ సినిమాలను విడుదల చేసిన స్టార్ డైరెక్టర్ వర్మ చిత్రాల్లో శృతిమించని శృంగార సన్నివేశాలు వుంటూనే వుంటాయి. కానీ ఇప్పుడు వర్మ మారుతున్న ట్రెండ్ కనుగుణంగా తన స్టైల్ ను కూడా మార్చేసి శృతి మించిన శృంగారపు సన్నివేశాలతోనే సినిమాలను తీస్తున్నాడు. వర్మ తన తాజా చిత్రం విడుదల సందర్భంగా ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వర్మ స్త్రీల పట్ల తనకున్న ఫీలింగ్స్ ను ఓపెన్ గా తెలియజేశాడు. ఆ ఇంటర్వ్యూలో అతను మాట్లాడిన మాటలను బట్టి వర్మ ఏ విషయాన్నైనా కుండ బ్రద్ధలు కొట్టనట్టుగా చెప్తాడని అర్ధమైంది. మరి వర్మ ఫీలింగ్స్ ఏమిటో మీరే చదివి తెలుసుకోండి..

“నేను సత్య హరిచంద్రుడి అవతారాన్ని.. నన్ను మీరలా భావించవచ్చు. ఎందుకంటే నేనెప్పుడూ ఉన్నదున్నట్టుగా ముఖం మీదే చెప్పేస్తుంటాను. నేను నాకు నచ్చినట్టు బ్రతకడానికి అస్సలు టైం వేస్ట్ చేయను. నేను ఇదీ అని చెప్పేస్తా. నాకు ఆటలో ఓడిపోవడమైనా ఇష్టమే కాని టైం వేస్ట్ చేయను. ఉదాహరణకు ఈరోజు మీ డ్రెస్ బాగుందని ఓ అమ్మాయికి చెప్పి.. ఆ తరువాత ఎలా ఉన్నారండీ.. లంచ్ చేశారా..? నా సినిమాలు చూస్తుంటారా..? అంటూ మాటలు కలిపి ఓ 10 రోజుల తర్వాత నాకు మీ మీద కోరిక ఉందండీ అని చెప్పి 10రోజుల టైం వేస్ట్ చేసుకోను. నాకు నచ్చిన అమ్మాయితో ఫస్ట్ మీటింగ్ లోనే మీ మీద కోరిక ఉందని చెప్పేస్తా…

అమ్మాయి నచ్చితే ఆమెను కలిసిన మొదటి రోజే అడిగేస్తా.. వర్కవుట్ అయితే అయ్యింది లేదంటే 10 రోజుల టైం సేవ్ అవుతుంది. వేరే పని చూసుకోవచ్చు. ఇప్పటికీ నేను ఫాస్ట్ ఫార్వర్డ్‌ లోనే బతుకుతున్నాను. లైఫ్ లో ఏవి పోయినా మళ్ళీ వస్తాయి కాని.. టైం మళ్లీ రాదు” అని ఒక ప్రక్క కాలం విలువను తెలియజేస్తూనే.. మరో వైపు “నా ఫస్ట్ క్రష్ పదో తరగతిలోనే జరిగింది. అప్పటి నుంచి ఇలాగే ఉన్నాను. నాకు ఇంటి పనులు చేసే ఆడవాళ్లు నాకు అస్సలు ఇష్టం ఉండదు. వాళ్లు చెమటలు పట్టి చిరాకుగా ఉంటారు. అమ్మాయి అంటే అందంగా, నాజుకుగా ఉండాలి. నా భార్య కూడా హౌస్ వైఫే కాబట్టి బోర్ కొట్టేసింది” అంటూ తనదైన స్టైల్ లో మహిళల పట్ల తనకున్న అభిప్రాయాన్ని ఓపెన్ గా తెలియజేసి అందరికీ షాక్ ఇచ్చాడు వర్మ. చదివారుగా.. సెన్సేషన్ డైరెక్టర్ వర్మ బోల్డ్ కామెంట్స్.. మరి వర్మ పై మీ కామెంట్స్ ఏమిటి.?