Director Relangi Narasimharao : ఎవరికీ చెప్పకుండా పోయి… ఆయన మరణాన్నీ ఆయనే కొని తెచ్చుకున్నాడు… దాసరి గారు మరణించడానికి కారణం ఇదే…: డైరెక్టర్ రేలంగి నరసింహారావు

0
573

Relangi NarasimhaRao : పాలకొల్లుకి చెందిన రేలంగి నరసింహారావు గారు దాదాపుగా తెలుగులో డెబ్భై సినిమాలు తీశారు. ఎక్కువగా రాజేంద్ర ప్రసాద్ హీరోగా సినిమాలు చేసిన ఆయన సినిమా ప్రయాణంలోని విశేషాలను తాజాగా ఇంటర్వ్యూలో పంచుకున్నారు. తెలుగే కాకుండా కన్నడలో కూడా సినిమాలను డైరెక్ట్ చేసారు నరసింహారావు. ఇక ఆయన సుమన్, రేవతి, కిన్నెరలను తెలుగు తెరకు పరిచయం చేసారు. ఇక రేలంగి నరసింహరావు గారు కూడా దాసరి గారి శిష్యుడే. ఆయన చివరి రోజుల్లో దాసరి గారి వద్దే ఉన్న ఆయన దాసరి గారి మరణానికి కారణాలను తెలిపారు.

దాసరి గారు చనిపోడానికి కారణం ఆయనే…

రేలంగి నరసింహా రావు గారు, ధవల సత్యం, కోడి రామకృష్ణ ఇలా ఎంతో మంది దాసరి నారాయణరావు స్కూల్ శిష్యులనే చెప్పాలి. డైరెక్షన్ లో దాసరి గారు మేటి అలాగే ఇండస్ట్రీకి కూడా పెద్ధ దిక్కుగా ఉన్న ఆయన అనారోగ్య కారణాలతో మరణించినా ఆయన మరణంకి సంబంధించిన అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి. ఇక ఆయన శిష్యుడిగా అయన చివరి రోజుల్లో ఆయనతో ఉన్న రేలంగి నరసింహా రావు గారు ఆయన మరణం గురించి మాట్లాడారు. నిజానికి దాసరిగారు లావు తగ్గాలనే ఉద్దేశంతో కడుపులో ఒక బెలూన్ పెట్టుంచుకుని ఆపరేషన్ చేయించుకున్నారట. అది ఉండటం వల్ల ఆకలి వేయకపోవడంతో కేవలం శరీరానికి కావాల్సిన ప్రోటీన్స్ ను టాబ్లెట్స్ రూపంలో తీసుకుంటే సరిపోతుంది.

అయితే ఆ సర్జరీ తరువాత ఆరు నెలలకు ఆ బెలూన్ తీసేస్తారు. అయితే దాసరి గారు మళ్ళీ ఆ బెలూన్ పెట్టుంచుకుని మరింత వెయిట్ తగ్గాలని భావించారట. అందుకే ఎవరికీ ఏ మాత్రం చెప్పకుండా వెళ్లి చేయించుకున్నారు. సీనియర్ డాక్టర్స్ లేని సమయంలో జూనియర్ డాక్టర్స్ తో సర్జరీ చేయించుకోవడం లోపలకి బెలూన్ ఆపరేషన్ సమయంలో పేలడంతో ఇన్ఫెక్సషన్ అయింది. మళ్ళీ మరో సర్జరీ చేసారు. అలా ఆయన ఆరోగ్యం క్షీణించింది అంటూ రేలంగి నరసింహారావు గారు తెలిపారు. హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్న సమయంలో నేను కోడి రామకృష్ణ, ధవల సత్యం సాయంత్రం సమయంలో వెళ్లి కబుర్లు చెప్పి కాలక్షేపం చేయించే వాళ్ళం ఆయనకు. ఒకరకంగా ఆయన మరణం స్వయంకృపరాధం అంటూ తెలిపారు.