Director Relangi Narasimharao : పాలకొల్లుకి చెందిన రేలంగి నరసింహారావు గారు దాదాపుగా తెలుగులో డెబ్భై సినిమాలు తీశారు. ఎక్కువగా రాజేంద్ర ప్రసాద్ హీరోగా సినిమాలు చేసిన ఆయన సినిమా ప్రయాణంలోని విశేషాలను తాజాగా ఇంటర్వ్యూలో పంచుకున్నారు. తెలుగే కాకుండా కన్నడలో కూడా సినిమాలను డైరెక్ట్ చేసారు నరసింహారావు. ఇక ఆయన సుమన్, రేవతి, కిన్నెరలను తెలుగు తెరకు పరిచయం చేసారు. ఇక రేలంగి గారు కూడా దాసరి నారాయణ రావు గారి శిష్యుడే. దాసరి గారి వద్దే ఉంటూ ఆయనకు దగ్గరగా పనిచేసిన రేలంగి గారు దాసరి గారి గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

దాసరి గారి సేవలు చెప్పాలంటే రోజు సరిపోదు…
దాసరి గారు తన పుట్టినరోజు వేడుకలను కూడా ప్రొడ్యూసర్ చేత చేయించుకునేవాడు కాదు, నిర్మాతకు ఖర్చు ఉండకూడదు అని అనుకుంటారు. ఇక ఆయన ఎంతో మంది కళాకారులకు, విద్యార్థులకు, వికలాంగులకు సహాయం చేసారు. అలా ఒకసారి శోభన్ బాబు గారి 75వ జన్మదిన వేడుకలు నిర్వహించాలని ఆయన అభిమానులు అనుకోగా దాసరి గారిని ఆర్గనైజ్ చేయమని అడుగగా ఆయన ఒక కండిషన్ పెట్టారు అంటూ రేలంగి నరసింహారావు గారు తెలిపారు.

పేద కళాకారులను ఆదుకోడానికి డబ్బు సహాయం చేస్తే ఖచ్చితంగా కార్యక్రమం ఆర్గనైజ్ చేస్తానని చెప్పారట. అలా కళాకారుల సంక్షేమం ఎక్కువగా ఆలోచించేవరంటూ ఇక ఆయన చుట్టూ ఉన్నవాళ్లలో ఆయనకు నచ్చిన వాళ్ళు కనపడకపోతే చాలా టెన్షన్ పడతారు. ఒకసారి ఆర్ట్ డైరెక్టర్ భాస్కర్ రావు గారు ఒకరోజులో తిరిగి వస్తానని చెప్పి వెళ్లి సమయానికి రాకపోయే సరికి తెలిసిన వాళ్లందరికీ ఫోన్ చేసి ఆయన గురించి ఆరా తీశారు. ఎవరికీ తెలియకపోవడంతో టీవీ లో యాడ్ వేయించారు. అలా ఆయనకు ఆక్సిడెంట్ అయి హాస్పిటల్ లో ఉన్నారని తెలిసీ ఆయనకు మెరుగైన చికిత్స చేయించారు అంటూ దాసరి గారి గురించి ఆయన అనుభవాలను పంచుకున్నారు రేలంగి గారు.






























