Director Relangi Narasimharao : పాలకొల్లు కి చెందిన రేలంగి నరసింహారావు గారు దాదాపుగా తెలుగులో డెబ్భై సినిమాలు తీశారు. ఎక్కువగా రాజేంద్ర ప్రసాద్ హీరోగా సినిమాలు చేసిన ఆయన సినిమా ప్రయాణంలోని విశేషాలను తాజాగా ఇంటర్వ్యూలో పంచుకున్నారు. తెలుగే కాకుండా కన్నడలో కూడా సినిమాలను డైరెక్ట్ చేసారు నరసింహారావు. ఇక ఆయన సుమన్, రేవతి, కిన్నెరలను తెలుగు తెరకు పరిచయం చేసారు. ఇక రేలంగి గారు రాజేంద్ర ప్రసాద్ గారు హీరోగా ఎక్కువ సినిమాలను తీశారు. హాస్య ప్రధాన సినిమాలను తీసే ఈయన ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం, సంసారం, సుందరి సుబ్బారావు, చిన్నోడు పెద్దొడు, ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీస్ వంటి ఎన్నో హిట్ చిత్రాలను తీసారు. ఇక రాజేంద్ర ప్రసాద్ గారితో దాదాపు ముప్పై సినిమాలను చేసారు రేలంగి. వారిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం సినిమా మంచి హిట్ . ఇక ఆ సినిమా అనుభవాలను తాజాగా ఒక ఇంటర్వ్యూ లో పంచుకున్నారు రేలంగి గారు.

ఆమె విషయంలో కంగారు పడ్డాము….
రేలంగి నరసింహారావు గారు పిసినారి పాత్ర ద్వారా హాస్యం పుట్టించి కుటుంబ కథా చిత్రం తీయాలనీ భావించారు. అలా అహనా పెళ్ళంటా సినిమా లాంటి సినిమా తీయాలనీ అనుకున్న ఆయన రాజేంద్ర ప్రసాద్ హీరోగా, దివ్యవాణి హీరోయిన్ గా ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం సినిమాను తీశారు. సినిమాలో మున్సిపల్ అధికారి పాత్రలో వై విజయ గారు నటించగా ఆమెకు తెలుగు రాక తప్పుగా తెలుగును మాట్లాడి హాస్యం పండిస్తారు. అలానే ఆమెకు పిఏ గా హీరోయిన్ అలాగే మున్సిపల్ కాంట్రాక్టర్ గా రాజేంధ్ర ప్రసాద్ నటించగా సినిమాలో విజయ గారిది కీలక పాత్ర క్లైమాక్స్ లో హీరోకి బ్రెయిన్ ట్యూమర్ ఉందని నాటకం ఆడి హీరో మారేలా చేసి భార్యభర్తలని కలిపే పాత్ర చేసారు.

అయితే క్లైమాక్స్ సీన్స్ షూటింగ్ అపుడు వై విజయ గారికి డేట్స్ లేవు. దీంతో కంగారు పడ్డారట రేలంగి గారు. అపుడే గురువు దాసరి గారి వద్ద నేర్చుకున్న మెలకువలను ప్రదర్శించి విజయ గారి కాంబినేషన్ లో బాబు మోహన్ ఎక్కువగా ఉంటారు కనుక ఆమెను బాబు మోహన్ ను కలిపి క్లైమేక్స్ సీన్ ముందే షూట్ చేసి మిగిలిన వాళ్ళతో అనుకున్న రోజున సీన్ షూట్ చేసారు. చూసే ప్రేక్షకుడికి ఆమె ఫ్రేమ్ లో లేదు అనేలా ఏమాత్రం తెలియకుండా మేనేజ్ చేసారు డైరెక్టర్. బాబు మోహన్ లేకుండా ఆమెను ఒక్కదాన్నే సీన్ షూట్ చేస్తే ప్రేక్షకులకు అనుమానం కలుగుతుందని అలా ప్లాన్ చేసినట్లు దర్శకుడు రేలంగి నరసింహారావు తెలిపారు.