నిత్యం ఎదో ఒక విషయంపై సెటైరికల్ కామెంట్స్ చేసే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తాజగా నెల్లూరు ఆయుర్వేద నిపుణుడు ఆనందయ్య గరించి తనదైన శైలిలో కామెంట్స్ చేసాడు. “ఎయిర్ ఫోర్స్ వన్ లో కృష్ణపట్నానికి అమెరికా అధ్యక్షుడు జో బైడేన్, డా.ఫాసీ వెళ్తున్నారని విన్నాను. ఆనందయ్యతో కరోనా రెసిపీ కోసం డీల్ కుదుర్చుకోవడానికి ఉండొచ్చు. ఆయన కిడ్నాప్ కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఆనందయ్యను జాతీయ సంపదగా గుర్తించి, మిలటరీ బలగాలతో భద్రతా కల్పించవచ్చు కదా..” అంటూ ట్విట్టర్ లో అర్జీవీ మార్క్ సెటైరికల్ కామెంట్స్ పోస్ట్ చేసాడు.

కరోనా కి ఉచితంగా పసర మందు ఇస్తూ గత కొద్దిరోజులుగా హాట్ టాపిక్ అయ్యారు ఆనందయ్య. కరోనా నియంత్రణకు ఆనందయ్య ఇచ్చే ఆయుర్వేద మందుకోసం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలనుంచి కూడా ప్రజలు కృష్ణపట్నం బాట పట్టరు. ఈ ఆయుర్వేదం మందుకు ప్రసార మాధ్యమాలు, సోషల్ మీడియాలో ప్రచారం రావడంతో దేశవ్యాప్తంగా ఆనందయ్య మందుకు డిమాండ్ భారీగా పెరిగింది. భారీగా జనాలు చేరుకోవడంతో నిన్న ఆయుర్వేద మందు పంపిణీకి తాత్కాలికంగా నిలిపివేశారు.
I heard that Joe Biden and Dr Fauci are on their way in Airforce one to krishna Pattanam..Maybe it’s to negotiate a deal for his corona recipe but I request the government to see that they don’t kidnap ANANDAYYA ????????????
— Ram Gopal Varma (@RGVzoomin) May 22, 2021



























