సినిమా ఇండ్రస్ట్రీలో నిత్యం వివాదస్పదమైన వార్తలలో నిలిచే వ్యక్తిగా ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గురించి తెలియనివాళ్ళుంరంటే అతిశయోక్తి కాదేమో.! సాధారణంగా సినిమా రంగంలో హీరో, హీరోయిన్లకి ఫ్యాన్స్ ఉంటారు కానీ మారుతున్న కాలానుగుణంగా డైరెక్టర్స్ కి కూడా ఫ్యాన్స్ ఉంటారని రాంగోపాల్ వర్మ నిరూపించాడు. ఇంతవరకూ తాను డైరెక్షన్ చేసిన సినిమాల కన్నా ఎక్కువగా సోషల్ మీడియాలో వివాదస్పదమైన అంశాలతోనే రామ్ గోపాల్ వర్మ పాపులర్ అయిన సంగతి అందరికీ తెలిసిందే.! తాజాగా రామ్ గోపాల్ వర్మ ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు.

ఈ ఇంటర్వ్యూలో భాగంగా తనని ఇంటర్వ్యూ చేసిన లేడీ యాంకర్ ని టార్గెట్ చేస్తూ.. ఈ మధ్య కాలంలో నేను చూసిన అందమైన అమ్మాయిలలో నువ్వు కూడా ఒక బ్యూటీ క్విన్ వి అంటూ యాంకర్ కి కితాబిచ్చాడు. అంతవరకూ బాగానే వుంది కానీ., అసలైన ట్విస్ట్ ఎప్పుడు మొదలైందంటే.. ఆ ఇంటర్వ్యూలో మన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఆ అమ్మాయినుద్దేశిస్తూ.. నీకు నా తర్వాత సినిమాలో బికినీలో నటించే ఆఫర్ ఇస్తాను. నీకు ఇష్టమైతే నటించొచ్చు. నాకు నిన్ను అలా చూడాలని వుంది అంటూ ఆఫర్ ఇచ్చేసరికి పాపం.. ఆ లేడీ యాంకర్ కి ఏం చేయాలో అర్ధంకాక నిశ్శబ్దంగా ఉండిపోయింది.

ఈ వీడియోని చూసిన కొందరు నెటిజన్లు ఈ ఇంటర్వ్యూని ప్రస్తుతం సోషల్ మీడియాలో భీభత్సంగా వైరల్ చేసేస్తున్నారు. సాధారణంగా రామ్ గోపాల్ వర్మ సినిమాలో నటించే ఛాన్స్ కోసం ఎంతో మంది ఎదురు చూస్తున్నారని, ఆ అవకాశం ఆ యాంకర్ కు త్వరగానే వచ్చింది కాబట్టి వెంటనే ఒప్పేసుకోమని రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసిన లేడీ యాంకర్ కి సలహాలు కూడా ఇస్తున్నారు. మరి మీరేమంటారు.?



























