సినిమా ఇండ్రస్ట్రీలో నిత్యం వివాదస్పదమైన వార్తలలో నిలిచే వ్యక్తిగా ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గురించి తెలియని వాళ్ళుంరంటే అతిశయోక్తి కాదేమో.! సాధారణంగా సినిమా రంగంలో హీరో, హీరోయిన్లకి ఫ్యాన్స్ ఉంటారు. కానీ.. మారుతున్న కాలానికనుగుణంగా డైరెక్టర్స్ కి కూడా ఫ్యాన్స్ ఉంటారని రాంగోపాల్ వర్మ నిరూపించాడు. ఇంత వరకూ తాను డైరెక్షన్ చేసిన సినిమాల కన్నా ఎక్కువగా సోషల్ మీడియాలో వివాదస్పదమైన అంశాలతోనే రామ్ గోపాల్ వర్మ పాపులరైన సంగతి అందరికీ తెలిసిందే.!

ఇక అసలు విషయానికి వస్తే.. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి కేంద్రం విధించిన లాక్‌డౌన్ నేపథ్యంలో టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్‌లు, అగ్ర హీరోలు, దర్శకులు ఎలాంటి షూటింగ్‌లు లేక ఇంటికే పరిమితమైన ఈ టైంలో టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మాత్రం వరుసగా మినీ మూవీస్ తీస్తూ టాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తున్నారు.

తాజాగా అందిన సమాచారం ఏమిటంటే.. వర్మ మరో హీరోని టార్గెట్ చేసినట్టు తెలిసింది. ఆయనే టాలీవుడ్ లెజెండ్ నందమూరి బాలకృష్ణ. ఆయన టీడీపీ ఎమ్మెల్యే కూడా కావడంతో వర్మ మన బాలయ్య బాబును టార్గెట్ చేసినట్టు సోషల్ మీడియాలో గాసిప్స్ షికార్లు చేస్తున్నాయి. గతంలో బాలయ్య ఇంట్లో కాల్పులు చోటు చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. దీనిపై టాలీవుడ్ లో పెద్ద చర్చ కూడా జరిగింది. అయితే లేటెస్ట్ గా ఈ సంఘటన ఆధారంగా వర్మ తన ఓటీటీ కోసం సినిమా చేయబోతున్నారట. ఆ రాత్రి ఏం జరిగిందంటే.?` అనే టైటిల్‌ని కూడా ఈ చిత్రానికి ప్రకటించిన్నట్టు టాలీవుడ్ టాక్. ఇదే నిజమైతే వర్మ ఈసారి ఏకంగా తేనె తుట్టెని కదిపినట్టేనని టాలీవుడ్ సినీ ప్రముఖులు గుసగుసలాడుకుంటున్నారు.



























