Director Sai Rajesh : హృదయ కాలేయం, కొబ్బరి మట్ట, కలర్ ఫోటో వంటి మూడు సినిమాల తరువాత నాలుగో సినిమాగా బేబీ సినిమాను రూపొందించిన సాయి రాజేష్ కలర్ ఫోటో సినిమాకు నేషనల్ అవార్డు కొట్టి తన టాలెంట్ ను నిరూపించుకున్నాడు. ఇక బేబీ సినిమాకు కూడా విమర్శకుల ప్రశంసలను అందుకున్నారు. సినిమాలో కథను చక్కగా చూపుతూ నటీనటుల నుండి నటన రాబట్టడంలో సక్సెస్ అయిన రాజేష్ తన కెరీర్ విశేషాలను, అవమానాలను రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

కలర్ ఫోటో సినిమా నా కథే…
సాయి రాజేష్ గారు తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ తాను ఎంతగా అవమానలను ఎదుర్కొన్నది వంటి విషయాలను తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. తనది ప్రేమ వివాహం అంటూ చెప్పిన ఆయన పదో తరగతి సెలవుల సమయంలో ప్రేమ మొదలయిందని, రెండేళ్లు ప్రేమించగా మరో ఏడేళ్లు ఇద్దరం ప్రేమించుకున్నామని తెలిపారు. ఆపైన చాలా ఇబ్బందులను ఎదుర్కొని పెళ్లి చేసుకున్నట్లు తెలిపారు. ఇంటర్ సమయానికి నేను బాగోలేను, నల్లగా ఉంటాననే అభిప్రాయం బాగా నాటుకుపోయి బాధపడేవాడిని.

అందుకే నా భార్య నన్ను ప్రేమించినా ఎవరికీ ఈ విషయం చెప్పకు. అందరూ నిన్ను తప్పుగా చూస్తారు. అదే సంఘటన కలర్ ఫోటో సినిమాలో పెట్టాను. నన్ను లవ్ చేస్తున్నావ్ అంటే ఎవరికైనా పడిపోతుంది అనే కామెంట్స్ వస్తాయి చెప్పకు అని చెప్పేవాడిని. ఇక వాళ్ళింట్లో మేమిద్దరం కలవకూడదని తనని వేరే చోట దాచేశారు. ఆరు నెలలు నరకం అనుభవించాను. ఇక ఇపుడు పెళ్ళై ఇద్దరు పిల్లలు అంజలి, అమృత చాలా హ్యాపీగా ఉన్నాం అంటూ చెప్పారు. తన ఇంఫీరియారిటీ కాంప్లెక్స్ చాలా ఎక్కువ ఉండేది అయితే ఇపుడు లేదు. ఎవరైనా ఏదైనా అంటే రజనికాంత్ లాంటి గొప్ప వాళ్ళను గుర్తుచేసుకుంటా అంటూ చెప్పారు సాయి రాజేష్.































