‘ఆ రోజు రామ్ చరణ్ కి అది చెప్పడానికి చాలా టెన్షన్ పడ్డా’ : సుకుమార్

టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో క్రియేటివ్ డైరెక్టర్ గా సుకుమార్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు.. ఆయన కెరీర్లో ‘రంగస్థలం’ సినిమా వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అని నిస్సందేహంగా చెప్పొచ్చు.. ఈ సినిమా సంచలన విజయం సాధించింది. రామ్‌చరణ్‌ హీరో, సమంత కథానాయికగా, 1980 నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. టాలీవుడ్‌ సినిమా కథలకు కొత్త దారులు చూపించిన చిత్రమిది.

కమర్షియల్‌ చిత్రాల ట్రెండ్‌కి బ్రేకులు వేసి ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచింది. ఇందులో చిట్టిబాబుగా రామ్‌చరణ్‌ చెవిటి వాడిగా రామ్‌చరణ్‌ అద్భుతమైన నటనని పలికించాడు.తాజాగా ఈ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు సుకుమార్‌. రంగస్థలం కథ చెప్పినప్పుడు రామ్‌చరణ్‌కి బాగా నచ్చిందట. ఆయన వెంటనే ఓకే చేశారట. కానీ అందులోని ఓ సీన్‌ చెప్పేటప్పుడు మాత్రం తాను చాలా టెన్షన్‌ పడ్డానని చెప్పాడు.

రామ్‌చరణ్‌ ఎలా రియాక్ట్ అవుతాడో, ఆయన దీన్ని తీసుకుంటాడా? లేదా? అని భయపడ్డాడట. ఆ సీన్‌ గురించి చెబుతూ, ప్రకాశ్‌ రాజ్‌ ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఆయనకు అన్ని సపర్యలు హీరోనే చేయాల్సి ఉంటుంది. గడ్డం గీయడం దగ్గర్నుంచి, బట్టలు మార్చడం, చివరికి టాయిలెట్‌ బ్యాగ్‌ తనే తీయాల్సి ఉంటుంది. ఈ లైన్‌ గురించి చెప్పేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డానని, కానీ చెప్పాక రామ్‌చరణ్‌ మాత్రం మరో మాట లేకుండా చేసేద్దామని కూల్‌గా చెప్పారని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు సుకుమార్‌.

అది నిజంగా తనకు సర్‌ప్రైజింగ్‌గా అనిపించిందన్నారు. ఆయన వద్ద నుంచి ఈ ఆన్సర్‌ ఎక్స్‌పెక్ట్‌ చేయలేదు. టెన్షన్‌ పడుతూనే ఈ సీన్‌ను వివరించాడట. కానీ చరణ్‌ దాన్ని అర్థం చేసుకున్నారు. ఒక నటుడిగా ఉండాల్సిన లక్షణమది. ఏ పాత్రనైనా చేయగలగాలి. రామ్‌చరణ్‌ వందకు వంద శాతం తన పాత్రకు న్యాయం చేశారని సుకుమార్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం రామ్‌చరణ్‌ నాన్న చిరంజీవితో కలిసి ఆచార్య మూవీలో ఆర్‌ఆర్‌ఆర్‌లో ఎన్టీఆర్‌తో కలిసి నటిస్తున్నారు. ఇక సుకుమార్‌ ప్రస్తుతం అల్లు అర్జున్‌ హీరోగా పుష్ప సినిమాని రూపొందిస్తున్నారు…!!