Director Surya Kiran : నేను ఇష్టంగా కట్టుకున్న ఇల్లు వేలం వేశారు… కళ్యాణి మళ్ళీ నా జీవితంలోకి వస్తే ఏం చేస్తానంటే..: సూర్య కిరణ్

0
1031

Director Surya Kiran : ‘సత్యం’ సినిమాతో దర్శకుడిగా తెలుగు సినిమాకు పరిచయమైన సూర్య కిరణ్ మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తరువాత ధన 51, రాజు భాయ్, బ్రహ్మాస్త్రం, చాప్టర్ 6 వంటి సినిమాలు తీసినా పెద్దగా ప్రేక్షకులకు చేరువ కాలేదు. కానీ చాలా మందికి తెలియని మరో సంగతి సూర్య కిరణ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా దాదాపు 200 సినిమాల్లో నటించాడు. మాస్టర్ సురేష్ పేరుతో తన చెల్లితో పాటు చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో చేసారు.

కళ్యాణి మళ్ళీ కనబడితే అలా చెబుతా…

ప్రస్తుతం బుల్లితెర మీద మంచి గుర్తింపుతో కొనసాగుతున్న నటి సుజిత, సూర్య కిరణ్ చెల్లెలు. ఇక సూర్య కిరణ్ హీరోయిన్ కళ్యాణి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కానీ వారి వ్యక్తిగత కారణాలతో విడిపోయారు. అయితే డివోర్స్ తీసుకునే సమయంలో కూడా జడ్జి కారణాలు ఏంటని అడిగితే కొడతాడా, వేధిస్తున్నాడా అని అడిగితే లేదని చెప్పింది. పిల్లలు ఎవరితో ఉండాలి అని అనుకుంటున్నారు అని జడ్జి అడిగితే పిల్లలు ఇంకా లేరని చెప్పగా అందుకే విడిపోతున్నారా అని జడ్జి అంటే అవును అని చెప్పింది. విడాకులయ్యాక కూడా కళ్యాణి కి చెప్పాను నేను చేసిన అప్పులన్నీ తీర్చాక మళ్ళీ నీ దగ్గరికి వచ్చి పెళ్లి చేసుకుంటా అని అంటూ సూర్య కిరణ్ చెప్పారు.

ఇక తన ఇప్పటి జీవితంలో రీ ఎంట్రీ కాదు తొలి ఎంట్రీ అని, గతాన్ని మర్చిపోయిన కొత్త మనిషి లాగా మళ్ళీ జర్నీ స్టార్ట్ చేస్తానని చెప్పాడు. ఈ జర్నీలో కళ్యాణి కనిపిస్తే పలకరిస్తాను, షేక్ హ్యాండ్ ఇస్తాను పరిచయం చేసుకుంటా అంటూ చెప్పారు. ఇక తాను ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఇంటిని బ్యాంకు వాళ్ళు వేలం వేసినపుడు చాలా బాధ పడ్డానని, అసలు ఏం జరుగుతోందో అర్థం కాలేదు ఆ నిమిషం, నాకు చిన్నప్పటి నుండి వచ్చిన అవార్డులు అన్నీ అక్కడే ఉండిపోయాయి. అవి తెచ్చుకోవాలనే ధ్యాస కూడా కలుగలేదు అంటూ ఎమోషనల్ గా చెప్పారు. మళ్ళీ కథలు రాసుకుని మంచి సినిమాలు తీస్తా, బాగా డబ్బులు సంపాదిస్తానని ఆ తరువాత పెళ్లి చేసుకుంటానని చెప్పారు.