Director SV Krishnareddy : డాక్టర్ అవ్వాలనుకుని యాక్టర్ అయిన వాళ్ళ గురించి తెలుసు. అలాగే యాక్టర్ అవ్వాలనుకుని డైరెక్టర్ అయిన టాప్ డైరెక్టర్ ఎస్వి కృష్ణా రెడ్డి. ఆయన గురించి చెప్పాలంటే ఆయన ప్రాణ మిత్రుడు అచ్చిరెడ్డి గురించి కూడా చెప్పాలి. రెండు దేహాలుగా ఉన్న ఇద్దరు మనుషులుగా వీళ్ళను వర్ణించవచ్చు. ఇక చదువుకునే రోజులనుండి ప్రాణ స్నేహితులుగా ఉన్న వీళ్లిదరూ చదువయ్యాక సినిమాల్లోకి వెళ్లాలని అనుకున్నారు. ‘పగడాల పడవ’ అనే సినిమాలో రెండో హీరో అవకాశం మొదటగా కృష్ణా రెడ్డికి వచ్చింది. ఇక ఆ సినిమా మధ్యలో ఆగిపోవడం, ఆ తరువాత ఆశించినంత అవకాశాలు లేకపోవడంతో కృష్ణా రెడ్డి బాధపడ్డారు. అచ్చిరెడ్డి హైదరాబాద్ లో ఏదో ఒక వ్యాపారం చేసుకుని ఆ తరువాత సినిమాల్లోకి వెళదామని భరోసా ఇచ్చాడు. ఇక సినిమా పరిశ్రమ హైదరాబాద్ వచ్చింది. కృష్ణా రెడ్డి, అచ్చి రెడ్డి కూడా హైదరాబాద్ లో ఏదైనా వ్యాపారం చేయాలనుకున్నారు, అలా ముందుగా ఇరానీ చాయ్ హోటల్స్ కి ఆంధ్ర స్వీట్లు సప్లై చేయడం మొదలు పిల్లలు తినే బొంగులు వరకు వ్యాపారాలు చేసి సక్సెస్ అయ్యారు. ఇక ఆ తరువాత పాత సినిమాలను మళ్ళీ డబ్బింగ్ చేసి రిలీజ్ చేసారు. మలయాళం సినిమాలను డబ్బింగ్ చేసి ప్రొడ్యూసర్స్ గా మంచి లాభాలు పొందారు.

ఫ్యామిలీ పిల్లలు ఏం చేస్తున్నారంటే…
అయితే హీరో అవ్వాలనుకున్న కృష్ణా రెడ్డి డైరెక్టర్ గా మారి హీరోలకు సూపర్ హిట్లు ఇచ్చారు. రాజేంద్రప్రసాద్ హీరోగా ‘కొబ్బరి బొండాం’ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే అందించారు. ఆ తరువాత రాజేంద్ర ప్రసాద్ హీరోగా మరోసారి ‘రాజేంద్రుడు-గజేంద్రుడు’ సినిమా తీసి హిట్ కొట్టారు. ఈ చిత్రానికి దర్శకత్వం కృష్ణా రెడ్డి వహించారు. ఆ తరువాత మూడో సినిమా రాజేంద్ర ప్రసాద్ కాంబినేషన్‌లోనే ‘మాయలోడు’ గా వచ్చి హ్యాట్రిక్ కొట్టారు. ఇక కెరీర్ పరంగా సూపర్ సక్సెస్ అందుకున్న కృష్ణా రెడ్డి గారి ఫ్యామిలీ గురించి బయట పెద్దగా తెలియదు.

ఆయన భార్య లలిత ప్రియ, ఆయనకు ఇద్దరు ఆడపిల్లలు కాగా ఇద్దరికీ పెళ్లిళ్లు అయ్యాయి. మొదటి కూతురు భర్త వ్యాపారవేత్త కాగా వారికి ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి సంతానం. ఇక రెండో కూతురుకి పెళ్లి జరిగింది చిన్న అల్లుడు కూడా వ్యాపారం చేస్తున్నాడని ఇంకా వారికి పిల్లలు లేరంటూ వారి కోసం ఎదురు చూస్తున్నామంటూ తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఎస్వి కృష్ణా రెడ్డి గారు పంచుకున్నారు.

































