Director V.V. Vinayak : కొడాలి నానికి మొదటి నుండి చంద్రబాబు అంటే నచ్చదు… ఎందుకు అలా తిడతావు అని అడిగితే ఏం చెప్పాడంటే…: డైరెక్టర్ వివి వినాయక్

0
318

Director V. V. Vinayak : ‘ఆది’ సినిమాతో మొదలు పెట్టి దిల్, సాంబ, అదుర్స్, లక్ష్మి, యోగి, చెన్నకేశవరెడ్డి, అల్లుడు శీను, బద్రీనాథ్, ఠాగూర్, ఖైదీ నెంబర్ 150 వంటి సినిమాలతో అలరించిన మాస్ డైరెక్టర్ వినాయక్ తన సినిమాలకు ఈ మధ్య కాలంలో కొంత బ్రేక్ ఇచ్చాడు. ఇంటెలిజెంట్ సినిమా తరువాత సినిమాలకు గ్యాప్ ఇచ్చాడు. నటుడుగా కూడా సినిమాల్లో చేస్తున్న వినాయక్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ అల్లుడు శీను సినిమా హీరో బెల్లం కొండ సాయి శ్రీనివాస్ తో రాజమౌళి సినిమా ఛత్రపతి రీమేక్ ను హిందీలో తీశారు.

చంద్రబాబు ను కొడాలి నాని అందుకే తిడతాడు…

సాంబ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన కొడాలి నాని ఎన్టీఆర్ కి బాగా ఆప్తుడు. అప్పటి ఎలక్షన్లో కొడాలి నాని కి గుడివాడ సీట్ ను ఎన్టీఆర్ చంద్రబాబుని అడిగి ఇప్పించాడు. అప్పుడు నేను వెళ్ళాను చంద్ర బాబు దగ్గరికి అంటూ చెప్పాడు వినాయక్.

ఎప్పుడూ ఎందుకు కొడాలి నాని మరి చంద్రబాబు ను బూతులు తిడతాడు అని అడుగగా మొదటి నుండి కొడాలి నానికి చంద్రబాబు అంటే నచ్చదు. సీనియర్ ఎన్టీఆర్ విషయంలో నాని కి చంద్రబాబు అంటే నచ్చదు. కొన్నిసార్లు ఆ తిట్టడం మరీ ఎక్కువైనప్పుడు ఏంటి మరీ అలా తిడుతున్నాడు అనిపిస్తుంది కానీ వాళ్ళ రాజకీయాలు వాళ్ళవి, ఎందుకు అలా తిడతావు అని నేను అడగను అంటూ వివరించారు.