పచ్చదనం పరిచినట్టుగా ఇంద్రధనస్సు లంగరూ వేసినట్టుగా దర్శకుడు వంశీ పసలపూడి స్వగ్రామం ఉంటుంది. ఆయన స్నేహితుడు రవి చిన్నతనంలోనే ఆంగ్ల నవలలను తెలుగులోకి అనువదించి ఈయనకు చెప్పేవాడు. అలా ఆ స్నేహితుని ప్రభావం ఈ దర్శకుడి పై ఉండేది. పసలపూడి లో ఒక అమ్మాయి ఎప్పుడు నవ్వుతూ ఉండేదట అలా ఆమెపై సత్య సుందరి నవ్వింది. అనే మొదటి కథ రాయడం జరిగింది. ఆ రోజుల్లో ఔత్సాహిక యువకులను ప్రోత్సహిస్తూ రేడియోలో దానిని ప్రసారం చేయడం జరిగింది.

1974 ఆ ప్రాంతంలో అంటే ఈ దర్శకుడి 14 యేట “నల్ల సుశీల” అనే మరో కథ రాయడం జరిగింది. అలా ఆ కథ మొదటగా ఆంధ్రజ్యోతి దీపావళి లో ప్రచురితమయ్యింది. ఆ తర్వాత రాసిన మంచు పల్లకి అనే ఆరు వారాల నవల కూడా ఆంధ్రజ్యోతి కాంపిటీషన్స్ లో ప్రచురితమయ్యింది. ఇలా చదువుకుంటూ నవలలు రాస్తున్న సమయములో హఠాత్తుగా వంశీ నాన్నగారు చనిపోవడం జరిగింది. ఆ 18 సంవత్సరాల వయసులో నాన్నగారి సంఘటన దర్శకుడు వంశీని తీవ్రమైన డిప్రెషన్ లోకి నెట్టింది.
నిరాశతో ఏమీ తెలియని స్థితిలో ఉన్న వంశీని చూసి… నవలలు సాహిత్యంపై అవగాహన ఉన్న నీవు ఉండడం ఇక్కడ కాదని మద్రాసుకు ఒక స్నేహితుడు తీసుకెళ్లడం జరిగింది. మద్రాస్ లో వి. మధుసూదనరావు గారిని వంశీ కలిశారు. అప్పుడాయన ఇంత చిన్న వయసులో నవలలు రాయడం ఏమిటి అని ఆశ్చర్యపోయి..పక్కనే థియేటర్లో ఆడుతున్న ఫ్రెండ్స్ అనే ఇంగ్లీష్ చిత్రాన్ని చూసి ఏదైనా ఒక మంచి లైన్ రాసుకుని రమ్మని చెప్పడం జరిగింది.

మధుసూదన్ రావు పది సార్లు చూసి రాయమంటే ఒకే సారి సినిమా చూసి వంశీ ఒక స్టోరీ లైన్ ని చూపించడం జరిగింది. పది సార్లు సినిమా చూడమంటే ఒకే సారి చూసి ఎలా రాసుకుని వచ్చావ్ అని ఆశ్చర్యపోయాడు. వెంటనే దర్శకుడు వంశీని ఆయన కారులో ఎక్కించుకొని శోభన్ బాబు షూటింగ్ కి తీసుకెళ్లడం జరిగింది. అలా మధుసూదన్ రావు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తూ యండమూరి వీరేంద్రనాథ్ పరిచయం తో మంచు పల్లకి అనే సినిమాను చిరంజీవి సుహాసినితో తీయడం జరిగింది. మొదటి సినిమా అయినప్పటికీ ఫెయిల్యూర్ అయ్యింది. రెండో సినిమాగా భానుప్రియ, సుమన్ లతో సితార సినిమా తీయడంతో అది సూపర్ డూపర్ హిట్ అయింది.

అలా 40సంవత్సరాల్లో సీనియర్ వంశీ దాదాపు 23 చిత్రాలను మాత్రమే చేయడం జరిగింది. మెగాస్టార్ చిరంజీవిని మినహాయిస్తే వంశీ పెద్ద హీరోలతో సినిమాలు ఏవి చేయలేదని చెప్పవచ్చు. అలా స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ తో గోలిపురం రైల్వే స్టేషన్ అనే సినిమాను అత్యంత సహజమైన శైలిలో ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా మొదలుపెట్టిన ఈ సినిమా ఎందుకోగానీ మధ్యలోనే ఆగిపోయింది. ఈ క్రేజీ కాంబినేషన్ వచ్చి ఉంటే ప్రేక్షకులు ఎంతగానో సంతోష పడేవారనిపిస్తుంది. ఆ తర్వాత వంశీ గారి సినిమాలు వచ్చినా కూడా వెండితెరపై ఎక్కువ ఆడిన సందర్భాలు లేవని చెప్పవచ్చు.



























