Director Varanasi Surya : ఏపీ రాజకీయాల్లో వైసీపీ టార్గెట్ ప్రస్తుతం టీడీపీ కాదు జనసేన. జనసేన, వైసీపీ రెండు పార్టీలు వ్యూహత్మకంగా ఒకరినొకరు తిట్టుకుంటూ టీడీపీ ని సైడ్ ట్రాక్ లోకి నెడుతున్నారు అనే వాదన ఒకవైపు వినిపిస్తోంది. అయితే వైసీపీ పదే పదే పవన్ ను టార్గెట్ చేయడమే కాకుండా మరోవైపు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ద్వారా జనసేన, మరోవైపు టీడీపీ ఇద్దరికీ పంచులు వేయిస్తున్నారు. ఇక లేటెస్ట్ గా జనసేన కు సపోర్ట్ చేస్తూ డైరెక్టర్ వారణాసి రంగంలోకి దిగారు.

మాట్లాడితే మూడు పెళ్లిళ్లు తప్ప మరేం లేదు…
వైసీపీ పార్టీ నేతల గురించి వారణాసి సూర్య మాట్లాడుతూ, మాట్లాడితే పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల గురించి తప్ప మరో విషయం మాట్లాడటానికి వైసీపీ వాళ్లకు మరో మ్యాటర్ లేదు. పవన్ కళ్యాణ్ గారు మూడు పెళ్లిళ్లు చేసుకున్నా లీగల్ గా విడిపోయి చేసుకున్నారు, ఎవరికీ అన్యాయం చేయలేదు. కానీ వీళ్ళు పదే పదే ఈ విషయం గెలుకుతూ పవన్ ను గిల్లుతుంటారు.

వైసీపీ సోషల్ మీడియా నుండే పవన్ మూడో భార్యకి విడాకులు అంటూ రూమర్స్ బయటికి వస్తున్నాయి. అవన్నీ ఒట్టి రూమర్స్ మాత్రమే అందులో నిజం లేదు. ఈ క్లారిటీ ఇవ్వకపోతే జనాలు వైసీపీ చేస్తున్న విష ప్రచారాన్ని నిజం అనుకుంటారు. మా నాయకుడి మీద విమర్శలను చేయడానికి మరో అంశం దొరక్క వైసీపీ వాళ్ళు ఇంట్లో ఆడవాల్ల మీద పడ్డారు అంటూ వారణాసి సూర్య ఫైర్ అయ్యారు.


































