పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే అవకాశం వస్తే ఆ దర్శకుడి పంట పండినట్లే.. ఈయనతో ఒక్క సినిమా తీసే అవకాశం వస్తే చాలని టాలీవుడ్ లో ఉన్న అగ్ర దర్శకులందరూ అనుకుంటూ వుంటారు..కానీ ఈసారి ఆ అదృష్టం డైరెక్టర్ వేణు శ్రీరామ్ ని వరించింది..ఇక వేణు శ్రీరామ్ ఓ మై ఫ్రెండ్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి… ఇటీవలే నేచురల్ స్టార్ నాని హీరోగా ఎంసీఏ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు..ఇక తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో వకీల్ సాబ్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఏప్రిల్ 9న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్బంగా డైరెక్టర్ శ్రీరామ్ వేణు.. తన అనుభవాలను మీడియాతో పంచుకున్నారు.

మనకు నచ్చిన పని చేసినప్పుడు వచ్చే సంతృప్తిని సంతోషాన్ని ఇప్పుడు పొందుతున్నాను. కష్ట సుఖాలు ప్రతి పనిలో ఉంటాయి. అలా ప్రతి సినిమాకు, దర్శకుడికి ఉంటాయి. అలా నేను ఎంసీఏ సినిమా సమయంలో చాలా ఒత్తిడికి గురయ్యాను. కానీ వకీల్ సాబ్ సినిమా చేస్తున్నప్పుడు ప్రతి రోజు ఎంజాయ్ చేశాను. ఎప్పుడూ పవన్ గారిని చూడగానే సంతోషం కలుగుతుంది అంటూ చెప్పుకోచ్చాడు శ్రీరామ్. ఈ మూవీ స్టోరీ చెప్పడానికి పవన్ గారిని వెళ్లి కలిశాను. ఆయన నాతో మాట్లాడుతూ… పింక్ రీమేక్ సినిమాను ఎలా చేద్దామనుకుంటన్నారు, మీ ఆలోచనలు ఏంటి అని అడిగారు.ఈ కథను ఎలా తెరకెక్కించాలని ఆలోచిస్తున్నారు అని అడిగి తెలుసుకున్నారు. అలా రెండు మూడు సార్లు మేమిద్దరం కలిసి మాట్లాడుకున్నాం. ఈ మూవీ స్టోరీ, స్క్రీన్ ప్లే, క్యారెక్టర్ గురించి నేను అనుకునే విషయాలు ఆయనతో చెప్పాను. ఆయన కూడా కొన్ని సలహాలు ఇచ్చారు. అలా కొన్ని మార్పులు చేశాం.
పింక్ సినిమాను రాస్తున్నప్పుడు పవన్ ఇమేజ్ గుర్తు చేసుకుంటూ రాసుకున్నాను. ముఖ్యంగా పవన్ ఫ్యాన్స్‌కు నచ్చే విధంగా ఈ మూవీలో తీయాలనుకున్నాను అని తెలిపాడు.పవన్ కళ్యాణ్ గారితో ప్రతి ఒక్క డైరెక్టర్ సినిమా చేయాలని కోరుకుంటారు. అలా పవన్ గారికి ఉన్న స్టేచర్‌కు ఉమెన్ ఎంపవర్మెంట్ కంటే మంచి కాన్సెప్ట్ ఉండదు. ప్రస్తుతం ఆయనకు బాధ్యతగల సినిమాలు మాత్రమే కావాలి. ఇంతకంటే కమర్షియల్ కథలు మరేముంటాయి అని తెలిపాడు. నేను రాసుకున్న స్క్రీన్ ప్లేకు తగినట్లే పవన్ గారు, నాయికల క్యారెక్టర్స్ ఉంటాయి. ట్రైలర్లోనే కథ చెప్పేశాను..ఈ సినిమా కథలో మెయిన్ పాయింట్ ఉమెన్ ఎంపవర్ మెంట్ గురించే ఉంటుంది.. కచ్చితంగా ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని తెలియజేశాడు దర్శకుడు వేణు శ్రీరామ్…!!






























