Disha Patani : ప్రస్తుతం ప్రభాస్ రాధే శ్యామ్ సినిమా తరువాత సలార్, ప్రాజెక్ట్ కె చిత్రలలో బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ప్రభాస్ తన తోటి నటీ నటులతో చాలా సరదాగా వుంటారని అందరు అంటుంటారు. అంతేకాకుండా తన సినిమా షూటింగ్ లు హైదరాబాద్ లో జరిగితే షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చిన నటీ నటులకు తన ఇంటి భోజనం తినిపించడం తనకి ఇష్టమట. ఇప్పటికే చాలా మంది బాలీవుడ్ నటీ నటులు ప్రభాస్ ఇంటి భోజనం రుచి చూసారట. అయితే ప్రస్తుతం ఈ జాబితా లోకి బాలీవుడ్ హీరోయిన్ దిశా పటాని కూడా చేరిపోయింది.

ప్రభాస్ ఇంటి భోజనం రుచి చూసిన దిశా….
ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కె షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. అయితే ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం బాలీవుడ్ హీరోయిన్ దిశా పటాని ని ఎంపికచేసుకున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం దిశా పటాని కి సంబంధించిన సన్నివేశాలు హైదరాబాద్లో చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. ఈ షూటింగ్ నిమిత్తం దిశా పటాని హైదరాబాద్ చేరుకున్నారు. అయితే హైదరాబాద్ షూటింగ్ లో పాల్గొన్న దిశా పటాని కి ప్రభాస్ తన ఇంటి నుంచి భోజనం రుచి చూపించారట. అయితే ప్రభాస్ ఇంటి నుంచి తెప్పించిన ఆహార పదార్థాలకు ఫిదా అయిన దిశా ఈ విషయంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎపుడు డైటింగ్ అంటూ ఇష్టమైన ఫుడ్ ని పక్కన పెట్టే మన హీరోహీరోయిన్లు ఇలాంటి ఇంటి భోజనం తిన్నాక ఫిదా అవ్వాల్సిందే మరి . అందుకే దిశాపటాని సోషల్ మీడియా వేదికగా “థాంక్యూ ప్రభాస్… మమ్మల్ని చెడగొట్టేశావ్” అంటూ స్పందించంది.

































