టాలీవుడ్లో ప్రస్తుతం వరుస హిట్స్ తో సక్సెస్ ఫుల్ హీరోగా మారాడు సూపర్ స్టార్ మహేష్ బాబు..భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు వంటి బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ తర్వాత ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ అనే సినిమా షూటింగ్ లో ఫుల్ బిజీగాఉన్నాడు మహేష్… గీత గోవిందం సినిమాతో మంచి విజయాన్ని అందుకోవడంతోపాటు పేరు తెచ్చుకున్న దర్శకుడు పరశురామ్ ఈ సినిమాను తెరకెక్కిస్తాన్నాడు. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.

బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు పరశురామ్. ఈ సినిమాలో సరికొత్త లుక్ లో కనిపించనున్నాడు మహేష్. ఇప్పటికే విడుదలైన మోషన్ పోస్టర్, షూటింగ్ స్పాట్ నుంచి లీకైన ఫోటోలు సినిమా పై ఆసక్తిని పెంచేసాయి. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు.దాదాపు 11 ఏళ్ల తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా రాబోతుంది.
గతంలో ఈ ఇద్దరు కలిసి అతడు, ఖలేజా విషయం తెలిసిందే. ఇక మహేష్, త్రివిక్రమ్ సినిమా గురించి రోజుకొక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ దిశాపటాని నటిస్తుందని ఓ వార్త చక్కర్లు కొడుతుంది. ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. వరుణ్ తేజ్ నటించిన లోఫర్ సినిమాతో ఈ ముద్దుగుమ్మ తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఈ సినిమాను డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ తెరకెక్కించారు.
ఆ తర్వాత బాలీవుడ్ లో బిజీ అయిపోయింది. అయితే మహేష్ -త్రివిక్రమ్ సినిమాకు ముందుగా పూజాహెగ్డే హీరోయిన్ గా అనుకున్నారు. ఇప్పుడు దిశా పేరు వినిపిస్తుంది. అయితే ఇటీవల త్రివిక్రమ్ సినిమా అంటే మినిమమ్ ఇద్దరు హీరోయిన్లు ఉంటారు. కాబట్టి ఈ సినిమాలో కూడా ఇద్దరు ఉండే అవకాశం ఉందని, అందుకనే దిశాపటానితో సంప్రదింపులు చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి..మరి త్రివిక్రమ్ ఈ బాలీవుడ్ బ్యూటీ కి ఛాన్స్ ఇస్తాడా.. లేక వేరే హీరోయిన్ ని సెలెక్ట్ చేస్తాడా అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే…!!































