Divi Vadthya: తెలుగు బిగ్ బాస్ ద్వారా ఫేమ్ సంపాదించుకొని అభిమానులకు దగ్గర అయింది దివి. ‘లెట్స్ గో’ అనే షార్ట్ ఫిల్మ్ ద్వారా కెరీర్ ను ప్రారంభించింది. మహేష్ బాబు హీరోగా వచ్చిన మహర్షి సినిమాలో కూడా దివి నటించింది. గ్లామర్ షాలతో అభిమానులను సంపాదించుకుంటున్న దివి వెబ్ సిరీస్ లలో కూడా కనిపిస్తోంది. ఇటీవల వచ్చిన మా నీళ్ల ట్యాంక్ అనే వెబ్ సిరీస్ లో నటించింది. అయితే ఈ వెబ్ సిరీస్ లో రమ్య అనే పాత్రలో నటించింది దివి. ఈ పాత్ర నిజ జీవితం లో దివి పాత్ర కు దగ్గరగా వుంది అన్న అభిప్రాయాలు కూడా లేకపోలేదు. రమ్య పాత్ర కూడా ఇంస్టాగ్రామ్ రీల్స్ ఫోటోలు అంటూ అభిమానులను సంపాదించుకుంటుంది.

మగాళ్లని ఎలా మాయ చేయొచ్చు…
అయితే తాజాగా తాను చేసిన రమ్య పాత్రకి సంబంధించి డైలాగ్స్ తో ఇన్ స్టాగ్రామ్ లో రీల్ చేసి, వీడియో పోస్ట్ చేసింది దివి. ఈ వీడియోలో… అలా నిలబడి.. తల దించుకొని కళ్లు పైకి ఎత్తి.. జుట్టుని సరి చేసుకుంటూ.. అమ్మో బాపుగారో బొమ్మో పాటకి స్టేటస్ పెడితే చాలు మొగోల్లు అలా ఇంటి ముందు క్యూ కడతారు. అంతేకాకుండా కొద్దిగా ఎక్సపొజింగ్ చేస్తూ… కొద్దిగా నడుం చూపిస్తే చాలు.. దెబ్బకి పడిపోతారు’ అంటూ బోల్డ్ డైలాగ్స్ తో వీడియో చేసింది.

మగాళ్లని ఎలా మాయ చేయొచ్చు.. అందంతో ఎలా ఫ్యాన్స్ ని తనవెంట తిప్పుకోవచ్చు.. అనే విషయాలపై హీరోయిన్ కి హితబోధ చేస్తూ… అందులోను సీమ యాసతో ‘ఒంటి మీద సరుకు ఉన్నప్పుడే మార్కెట్ చేసుకోవాలి’.. అని జీవితసత్యాలు కూడా చెబుతోంది దివి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ డైలాగ్స్ తెగ వైరల్ అవుతున్నాయి.



























