“దివి వద్త్యా” తెలుగు ప్రేక్షకులకు ఈ పేరు చాలా సుపరిచితమే.. బిగ్ బాస్ లో తన అందాలతో హల్చల్ చేసిన బ్యూటీ సూపర్ పాపులారిటీ సంపాదించుకుంది. అయితే బిగ్ బాస్ కంటే ముందే టాలీవుడ్ లో పలు సినిమాలో నటించింది. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన “మహర్షి” సినిమాతో పాటు పలు సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు ఈ ముద్దుగుమ్మకి.

అయితే తాజాగా 2020 సంవత్సరానికి గాను టెలివిజన్ రంగంలో అత్యంత ప్రతిభను కనబర్చిన సెలబ్రిటీలను హైదరాబాద్ టైమ్స్ ఎంపిక చేసింది. ఈ జాబితాలో జాబితాలో దివికి మొదటి స్థానం దక్కింది. మోస్ట్ డిజరైబుల్ ఉమెన్ ఫర్ టీవీగా గుర్తింపు సంపాదించుకుంది.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన దివి.. తనకు పొడుగ్గా ఉండే యువకులంటే చాలా ఇష్టమని తెలిపింది. తన ఎత్తు 5.8 అని తనకు కాబోయే వాడు సుమారు 6.2 లేదా అంతకంటే కొంచెం ఎక్కువగా 6.3 ఉండాలని కోరుకుంటానని తెలిపింది. ఇంకేంటి మరి పొడుగ్గా ఉన్నవాళ్లు అందరూ ట్రై చేయండి.

































