ఈ రంగుల సినీ ప్రపంచంలో రాణిగా వీలైతే మహారాణిగా ఎదగాలని ప్రతి నటి కోరుకుంటుంది. అదృష్టం, నటన, వ్యక్తిత్వం ఇలా అనేక అంశాలతో కొంతమంది తారలు అందని ఆకాశంలో తారాజువ్వలుగా వెలుగొందుతారు. మరికొంతమంది అందని అదృష్టంతో పోరాడి చివరకు నేలరాలుతారు. ఇంకొంతమంది నటుల నిజ జీవితానికి సినిమా జీవితానికి సరిపడక మధ్యలోనే తమ తనువు చాలిస్తున్నారు.ఇక ఆర్థిక పెను తుఫాను లో కొట్టుకుపోయిన తారలు ఆనాటి నుంచి నేటి వరకు కోకొల్లలుగా మన కళ్ళ ముందే కదలాడుతున్నారు.

1974 ఫిబ్రవరి 25న ముంబై లో జన్మించిన దివ్యభారతి బాల్యంలోనే ఆమె పరిచయస్తులు అచ్చు నువ్వు శ్రీదేవి లా ఉన్నావు అనడంతో ఆనంద పడేది. దివ్యభారతి ఎలాగైనా సినిమాలో నటించాలనుకున్న బాలీవుడ్ లో కొన్ని హిందీ సినిమాలు వచ్చినట్టే వచ్చి జారిపోయాయి. ఒకవైపు వచ్చిపోతున్న సినిమాలు మరోవైపు చదువుపై కాన్సంట్రేట్ చేయలేక పోతున్న దివ్యభారతికి అలా సినిమాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణములో దివ్యభారతి ఇంటిని సురేష్ ప్రొడక్షన్స్ వారు తలుపుతట్టారు.

1990 లో దివ్యభారతి నటించిన తెలుగు చిత్రం బొబ్బిలి రాజా, ఈ సినిమాతోనే తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమై చిరంజీవితో రౌడీ అల్లుడు మోహన్ బాబుతో అసెంబ్లీ రౌడీ బాలకృష్ణతో ధర్మక్షేత్రం మొదలగు తెలుగు చిత్రాల్లో నటిస్తుండగా హిందీలో సన్నీ డియోల్ సరసన విశ్వాత్మ సినిమాలో నటించింది. ఆ సినిమా అంతగా విజయం సాధించకపోవడంతో షారుక్ ఖాన్ తో దీవాన అనే సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. ఆ తర్వాత తెలుగులో ఋష్యేందర్ రెడ్డి దర్శకత్వంలో ప్రశాంత్, దివ్యభారతి హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న క్రమంలో..

1993 ఎప్రిల్ 5న దివ్యభారతి ప్రమాదవశాత్తు తాను నివసిస్తున్న ఐదంతస్తుల భవనంపై నుంచి కిందపడి మరణించింది. తొలిముద్దు షూటింగ్ చివరి దశలో ఉండగా దివ్యభారతి మరణించడంతో ఆమె డూపు గా గ్లామర్ క్వీన్ రంభ నటించి ఆ సినిమాను పూర్తిచేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here